36 ఏళ్ల నుంచి రాయచూర్ రైల్వే లైన్ కోసం ఎదురు చూపులు

Looking back at the 36th anniversary of the Royal Railway line

Looking back at the 36th anniversary of the Royal Railway line

Date: 09/11/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
మూడున్నర దశాబ్దాలకు పైగా ప్రజలు రైతు కూత కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 36 ఏళ్ల క్రితం రాయచూరు రైల్వే లైను అంశం తెరపైకి వచ్చింది.రాజకీయ నాయకులు ప్రతి ఐదేళ్లకోసారి రైల్వే బడ్జెట్ పట్ల ఊరిస్తున్నారు తప్పా ఆరచణకు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఇక్కడి ప్రాంత ప్రజలు ఎదురు చూసినా మొండిచేయి చూపుతున్నారు. 2016 సంవత్సరంలో కేంద్ర బడ్జెట్‌లో 15 కోట్లు మంజూరు చేసినా నేటికి పనులు ముందుకు సాగడం లేదు.
దీంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య ఒప్పందం కుదిరినా రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో మొండిచేయి చూపింది.  అప్పటి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ మల్లు అనంతరాములు రైల్వే లైను మంజూరు కోసం తనవంతు పోరాటం చేశారు. తాను ప్రాతినిత్యం వహిస్తున్న పార్లమెంటు స్థానానికి గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిల మీదుగా నల్లగొండ జిల్లా మాచర్ల వరకు రైల్వేలైను ఏర్పాటైతే ఉమ్మడి పాలమూరులో సగం జిల్లా అభివృద్ది చెందుతుందని ఆయన తపన పడ్డారు.పార్లమెంట్‌లో మాచర్ల రైల్వేలైను గురించి ఆయన పార్లమెంటులో సుదీర్ఘంగా చర్చ లేవనెత్తారు.
దీంతో  అప్పట్లో రైల్వేశాఖ మంత్రి స్పందించి సర్వే జరిపించి అంచనాలు కూడా సిద్దం చేశారు. అయితే మల్లు అనంతరాములు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో రైల్వే సాధన కోసం పోరాటం చేసే వారే కరువైపోయారు. ప్రతి సంవత్సరం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రైల్వే నిర్మాణం పనులు రాజకీయ నాయకులకు గుర్తుకు వస్తాయి తప్పా నిధులు మంజూరు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు. గద్వాల నుంచి రాయచూరు వరకు పనులు ప్తూర్తు రైలు పట్టాలెక్కింది. కాని మాచర్ల నుంచి గద్వాల వరకు ఎలాంటి భూ సేకరణ జరగలేదు. పెద్ద ఎత్తున వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రజలు రైల్వే పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రైల్వే పనులు చేపట్టాలని సంబంధిత రైల్వేశాఖ ప్రతిపాదించింది. వీటి నిర్మాణానికి 919.78 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం నిధులు భరిస్తే కేంద్రం 25 శాతం నిధులు మంజూరు చేస్తుంది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఉమ్మడి ప్రభుత్వం 13 శాతం మాత్రం తాము భాగస్వామ్యం వహించగలమని చెప్పింది. దీంతో ఫైల్ పెండింగ్‌లో ఉండిపోయింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మళ్లీ రైల్వే అంశం తెరపైకి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం 51 శాతం, కేంద్ర ప్రభుత్వం 49 శాతం నిధులు కేటాయించాలన్న ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగానే 2016లో కేంద్ర బడ్జెట్‌లో 15 కోట్లు కేంద్రం కేటాయించింది. 2017 బడ్జెట్‌లో భారీగా నిధులు కేంద్రం కేటాయిస్తుందని భావించినా నిరాశే ఎదురైంది. అయితే 51 శాతం నిధులు భరిస్తామని చెప్పిన ప్రస్తుత అపద్దర్మ ముఖ్యమంత్రి తన దగ్గర రైల్వే ఫైల్ పెట్టుకొని నేటికి సంతకం పెట్టలేదు. దీంతో ముఖ్యమంత్రితోనే రైల్వే ఫైల్ ఉండిపోయింది. మళ్లీ రాజకీయ నాయకులకు మాచర్లగద్వాల రైల్వే లైను కోసం ఎన్నికల నినాదంగా మరింది. పాలకులు స్పందించి గద్వాల మాచర్ల రైల్వే పనులకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
Tags: Looking back at the 36th anniversary of the Royal Railway line

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed