జెంటిల్ మ్యాన్ గా కనపడి…అందినంత దోచుకుని..

Date:17/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
చూడ్డానికి జెంటిల్ మెన్ గా కనపడతాడు.. పై స్టార్ హోటల్లో బస చేస్తాడు. బంగారు నగలను ఆర్డర్ చేసాడు. చూస్తానని చెప్పి  నగలను తప్పించుకుంటాడు. సేల్స్ మాన్ ను మాయమాటలలో  పెట్టి అందినకాడికి దోచుకుని ఉడాయిస్తాడు. దేశంలోని ప్రధాన నగరాలను టార్గెట్ గా చేసుకొని  నేరాలకు పాల్పడుతున్న  అంతర్రాష్ట్ర  దొంగను గోపాలపురం పోలీసులు  అరెస్టు చేశారు. అతని నుంచి  రెండు బంగారు గొలుసులు 25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.సర్తక్ రావు బాబ్రాస్ . అండమాన్ నికోబార్ దీవులకు చెందిన వ్యక్తి. చూడ్డానికి ఉన్నత విద్యావంతుడిలా కనిపిస్తాడు. గొప్పింటి వ్యక్తిలా నటిస్తాడు. ప్రముఖ నగరాల్లోని అతి పెద్ద హోటళ్ళలో బస చేస్తాడు. బంగారం షాప్  వారికి ఫోన్ చేసి  నగలను ఆర్డర్ చేస్తాడు. హోటల్ కు తీసుకురమ్మని  చెప్పగా సేల్స్ మెన్స్ హోటల్ కు  నగలను తీసుకొని వస్తారు. నగలను చూస్తున్నట్టు  నటిస్తూ  సేల్స్ మెన్ ను  మాయమాటలలో పెడతాడు.  ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తానని బయటకెళ్లి కనిపించకుండా పారిపోతాడు. ఇలా ప్రధాన నగరాలలో అనేక మోసాలు చేసి జైలుకు కూడా వెళ్లారు. బెయిలు పై తిరిగివచ్చి  సికింద్రాబాద్ లోని బసేరా హోటల్ లో  మోసానికి పాల్పడి గోపాల పురం పోలీసులకు అడ్డంగా చిక్కాడు. నిందితుడి నుంచి రెండు బంగారు  గొలుసులు,25 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్ కు తరలించారు. హోటల్ యజమానులు ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఐడి కార్డు  తప్పనిసరిగా పరిశీలించాలని నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు.
జెంటిల్ మ్యాన్ గా కనపడి…అందినంత దోచుకుని..https://www.telugumuchatlu.com/looking-like-a-gentleman/
Tags: Looking like a gentleman …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *