లోకానికి వెలుగుబాట చూపిన ప్రభువు

Lord of the light to the world

Lord of the light to the world

Date:25/12/2018
ఏలూరు ముచ్చట్లు:
ప్రపంచానికి శాంతి మార్గాన్ని ప్రభోధించి అంతా శాంతియుత వాతావరణంలో జీవించేలా ప్రపంచానికి ఏసు ప్రభు వెలుగుబాట  చూపారని ఏలూరు శాసన సభ్యుడు  బడేటి బుజ్జి చెప్పారు. స్థానిక మన్నా చర్చిలో మంగళవారం బిషప్ ఎతాష రాజు, జ్యోతి రాజులకు ఆయన పుష్పగుచ్చాలు అందించి క్రిస్మస్  శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా బడేటి బుజ్జి మాట్లాడుతూ సమాజంలో హింసకు తావులేదని శాంతి మార్గమే మానవాళికి  నిజమైన రక్షణ అని చెప్పారు. సమాజంలో ఎన్ని అవరోధాలు సృష్టించినా వాటిని ప్రతీ ఒక్కరు గ్రహించి శాంతి మార్గాన్నే అనుసరించేలా ఏసు ప్రభువు బోధనలు ప్రపంచాన్ని ఆకర్షించాయని, అందుకే ప్రపంచ మంతా మత సామరస్యంతో శాంతి మార్గంలో ముందుకు సాగుతున్నదని అయన చెప్పారు. సమాజంలో అట్టడుగున వర్గాల ఆర్ధికాభివృద్దికి తెలుగుదేశ ప్రభుత్వం ఎన్నో పధకాలను అమలు చేస్తున్నదని బుజ్జి చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కేతానేడి భాస్కర్ రావు, గడి నాగమణి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Tags:Lord of the light to the world

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *