Natyam ad

హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. అనంతరం ఉదయం 10.30 గంటల నుండి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనంలతో అభిషేకం చేశారు.
రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు గజ వాహనంపై రాములవారు భక్తులకు కనువిందు చేయనున్నారు. వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, డెప్యూటీ ఈవోలు  గోవింద రాజన్, నాగరత్న, ఏఈవో  పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ సోమ‌శేఖ‌ర్‌, కంకణభట్టర్  సీతారామాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు  చలపతి,  సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Post Midle

Tags:Lord Rama’s effulgence on Hanuman’s vehicle

Post Midle