శివయ్య నీ రథానికి రక్షణ కరువాయ

కడప ముచ్చట్లు:


కడప నగరం దేవుని కడప ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయానికి కొన్ని సంవత్సరాల క్రితం కొందరు భక్తులు నూతన రథాన్ని తయారు చేయించిఇచ్చారు. ఆ రధాన్ని ఆలయ రాజ గోపురానికి ఆగ్నేయ దిశలో ఉంచారు. రథం ఎండకు ,వానకు తడవకుండా రేకుల సెల్టర్ అయితే వేశారు కానీ , రథం క్రింది భాగంలో ఓపెన్ గా వదిలేశారు. రథం ప్రాంతంలోకి అనేక చిత్తుకాగితాలు, చెత్తాచెదారము ,ఎండుటాకులు పేరుకుపోయి ఉన్నది. రధాన్ని  పాలతిన్ కవర్తో కప్పి ఉంచి ఉన్నారు. ఎవరైనా ఆకతాయిలు ,తెలియని పిల్లలు ఒక చిన్న అగ్గి నిప్పు రగల చేస్తే బగ్గుమని రధం దగ్ధమయ్య ప్రమాదం ఉన్నది. చేతులు కాలిన తర్వాత చేతులు తుడుచుకోవడం కంటే ముందు జాగ్రత్త చర్యనే మేలు….అని స్వామివారి భక్తులు అనుకుంటున్నారు.  ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు వివిధ రథాలు వివిధ రకాల ప్రమాదాలకు గురైన విషయం తెలిసినదే. ఆలయ అధికారులు స్పందించి రథానికి తగు రక్షణ చర్యలు పటిష్టంగా చేయాలని భక్తులు కోరుతున్నారు.

 

Tags: Lord Shiva protect your chariot

Leave A Reply

Your email address will not be published.