సోమలలో లాస్ ఏంజిల్స్ తెలుగు అకాడమీ చేయూత

సోమల ముచ్చట్లు:

 

సోమల మండలంలో సోమవారం లాస్ ఏంజిల్స్ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలకు వైద్య సేవలు అందించడానికి కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మానస మాట్లాడుతూ తెలుగువారి పై ఉన్న మమకారంతో నిత్య విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందితో పాటు ఆశ కార్యకర్తలకు మెడికల్ కిట్లు అందజేసి కరోనా వ్యాధి నివారణకు కృషి చేయాలని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అలాగే వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత కేఎంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పీవీ మిథున్ రెడ్డి సూచనలతో కరోనా వ్యాధి నివారణలో భాగంగా కందూరు యూత్ కు చెందిన రాజు ఆధం షరీఫ్లు తన మిత్ర బృందం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నీలిమ, రమ్య శ్రీ నాయకులు మల్లికార్జున రెడ్డి రాజా రెడ్డి హరి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Los Angeles Telugu Academy in Somala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *