ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు, మద్యం మాయం
పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లాలో రెండు ప్రభుత్వ మద్యం దుకాణాలలో నగదు, మద్యం గోల్ మాల్ అయ్యాయి. నరసరావుపేట మండలం కోటప్పకొండ యుటి ప్రభుత్వ మద్యం షాపులో ఎనిమిది లక్షల రూపాయల నగదును సూపర్ వైజర్ సంగీతరావు మాయం చేసాడు. ప్రస్తుతం నరసరావుపేట ఏక్సిఇ జ్ పోలీసులు అదుపులో సూపర్ వైజర్ సంగీతరావు వున్నాడు. సంగీతరావు నరసరావుపేట మండల వైసీపీ కీలక నేతకి ప్రధాన అనుచరుడుగా ఉండడం విశేషం. గురజాల నియోజకవర్గoలోని పులిపాడు ప్రభుత్వ మధ్యo దుకాణంలో 50 కేసుల మద్యం ,మూడు లక్షల నగదు మాయం అయ్యింది. ఇటీవల హత్య కాబడిన కునిరెడ్డి కృష్ణారెడ్డి నగదు,మద్యాన్ని మాయం చేసాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. నగదు,మద్యం మాయంపై ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags: Loss of cash and liquor in government liquor shops

