Natyam ad

గజరాజుల  దాడిలో వరి పంట నష్టం

పలమనేరు ముచ్చట్లు:


పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం  కడతట్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న బోడెనేగట్టు వద్ద సమీలా,రాజేష్  పంట పొలాల్లో గురువారం వేకువజామున 15 ఏనుగులు  సంచరించి ఐదు టెంకాయి చెట్లు, ఒక ఎకరా వరి పంట తొక్కిసలాటలో పూర్తిగా ధ్వంసం చేశాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఎన్ని  అడ్డుకట్టులు వేసిన ….గజరాజుల దాడులు  మాత్రం ఆగలేదని నష్టపోయిన  రైతన్నలకు నష్ట పరిహారం అందించిన పాపాన పొలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం వాటిల్లినప్పుడు సంఘటన స్థలంలో రైతన్నలకు సంబంధిత అధికారులు మాయ మాటలు చెప్పడం….. చేతులు దులుపుకోవడం తప్ప మరొకటి లేదని అటవీ సరిహద్దు ప్రాంతాల రైతన్నలు వాపోతున్నారు. గజరాజుల దాడిలో నష్టపోయిన  రైతన్నలు కార్యాలయాల చుట్టు తిరిగి కాళ్ళు అరిగాయే తప్ప……ప్రభుత్వ సాయం అందలేదని రైతన్నలు మొరపెట్టుకుంటున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల సివారున  ఏనుగులు కనీసం నెలలో మూడు సార్లు దర్శనం ఇస్తున్నాయి. ఏనుగుల నుండి మా పంట పొలాలకు మా ప్రాణాలకు తక్షణ పరిష్కారం చేసి రైతులను ఆదుకోవాలని ఆవేదన ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Tags: Loss of rice crop in the attack of Gajarajas

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.