Lost in Kharif ... Support

ఖ‌రీఫ్ లో న‌ష్ట‌పోయాం… ఆదుకోండి

Date:31/10/2020

క‌డ‌ప ముచ్చట్లు:

ఖ‌రీఫ్‌ సీజన్లో నష్ట పోయాం.. ఈ రబీలో నైనా ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్లో తాము పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధరలు లభించక పోవడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొంటున్నారు. ఓవైపు పెరిగిన వ్యవసాయ ఖర్చులు, మరోవైపు వర్షాలు తమను తీవ్రంగా నష్టపరిచాయని రైతులు వాపోతున్నారు.ఈ నేపథ్యంలో తాము పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు, సిఎంఆర్‌ విధానాలు రైతులకు ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన నిబం ధనలు ముఖ్య కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. దాంతో పుట్టి ధాన్యాన్ని కేవలం రూ. 9 వేలకే అమ్ముకోవాల్సి వచ్చిందని రైతులు వాపోయారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రారంభం కానున్న రబీలో నైనా తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి వ్యవసాయశాఖ రబీకి విత్తనాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.

 

 

 

ఐతే ఇప్పటి వరకూ సాగునీటి సలహా సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని రైతులు విమర్శి స్తున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటిని ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అనేది తెలియకుండా పోతోందని రైతులు అయోమయంలో ఉన్నారు. దాంతో నారుమడులు సిద్ధం చేయలా లేదా అనే మీ మాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. నారుమడులు సిద్ధం చేయడం ఆలస్యమైతే ఎక్కడ అదును తప్పి పోతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదునుతప్పితే ఎండలకు ధాన్యం విరుగుడు అయ్యే అవకాశముందని, ఫలితంగా ధరలు లేక మళ్లీ నష్టపోవాల్సి వస్తుందోనని రైతులు గాభరా పడుతున్నారు.ఈ నేపథ్యంలో కొందరు రైతులు ఇప్పటికే బోర్ల కింద నారు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. సన్న,చిన్నకారు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దాంతో సంబంధిత శాఖ అధికారులు వెంటనే ఐఎబి సమావేశాన్ని ఏర్పాటు చేసి, రబీ సాగుకు ఎప్పుడు సాగునీటిని విడుదల చేస్తారో తెలియజేయాల్సిన అవసరముందని రైతులు పేర్కొంటున్నారు. లేకపోతే రబీలోనూ తాము నష్టపోవాల్సి వస్తే ప్రభుత్వమే బాద్యత వహించాల్సి వస్తుందని చెబుతున్నారు.

విత్తనోత్పత్తికి కోలుకోలేని దెబ్బ

Tags: Lost in Kharif … Support

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *