యూపీలో కమల వికాసం… రెండోసారి యోగినే..

లక్నో ముచ్చట్లు:
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఉత్తర ప్రదేశ్‌లో మళ్లీ కమలం వికసించింది. అధికార పగ్గాలను తిరిగి బీజేపీ కైవసం చేసుకుంది. భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ మానియాకు యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ తోడుకావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయ దుందుభి మోగించింది. మోడీ-యోగి ఆదిత్యనాథ్‌లు యూపీలో డంబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ బీజేపీ ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఆ ప్రచారానికి తమ ఓట్ల ద్వారా ప్రజలు ఆమోదం తెలిపారు. 35 ఏళ్ల తర్వాత అక్కడ అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం విశేషం. యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ఆ రాష్ట్ర సీఎం కానున్నారు.  మొత్తం 403 మంది సభ్యులతో కూడిన యూపీ అసెంబ్లీలో.. మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాలు.  అధికార బీజేపీ 263 స్థానాల్లో అధిక్యంతో భారీ మెజార్టీ దిశగా దుసుకుపోతోంది.  మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు యూపీ అధికార పీఠం అందని ద్రాక్షే అయ్యింది. సమాజ్‌వాది పార్టీ-ఆర్ఎల్డీ కూటమి 110 స్థానాల్లో ముందంజలో నిలవగా.. బీఎస్పీ 4 స్థానాలు, కాంగ్రెస్ 4 స్థానాల్లో ముందంజలో నిలుస్తున్నాయి. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
2017 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే సమాజ్‌వాది పార్టీ -ఆర్ఎల్డీ కూటమి ఎక్కువ స్థానాల్లో గెలిచినా.. అధికారం మాత్రం అందని అధికార పీఠం మాత్రం దగ్గలేదు. అటు ప్రియాంక గాంధీ అన్నీ తానై యూపీలో కాంగ్రెస్‌ను ముందుకు నడిపినా.. అక్కడ ఆ పార్టీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేక ఢీలా పడింది. అటు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రభ కూడా యూపీలో మసకబారిపోయింది. కింగ్ మేకర్ కావాలన్న మాయావతి ఆశలు అడియాశలయ్యాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.ఓ రకంగా యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనావేయడంలో ఎగ్జిట్ పోల్స్ విజయం సాధించాయని చెప్పొచ్చు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ మళ్లీ బీజేపీయే అధికారంలోకి రావచ్చని అంచనావేశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను యూపీలోని ప్రతిపక్షాలన్నీ తోసిపుచ్చాయి. విజయం తమదేనంటూ ధీమా వ్యక్తంచేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ యూపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్నాయి.2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 315, ఎస్పీ 47, బీఎస్పీ 19, కాంగ్రెస్ 7 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే బీజేపీకి ఆ స్థాయి మెజార్టీ దక్కకపోయినా.. వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది.
 
Tags:Lotus development in UP … Yogine for the second time

Leave A Reply

Your email address will not be published.