తెలంగాణకు కమలం రోడ్ మ్యాప్

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ బీజేపీకి ప్రధాని మోదీ రోడ్ మ్యాప్ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి దగ్గరగా ఉన్నామని.. ఆ అధికారానికి దగ్గరగా వెళ్లాలంటే ఏం చేయాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీనేతలకు వివరంగా చెప్పారు. హైదరాబాద్ కార్పొరేటర్లందరితో మోదీ ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు వారిని కలవాల్సి ఉన్నా.. సాధ్యం కాలేదు. దీంతో వారినేఆయన ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడారు. కార్పొరేటర్లను బీజేపీ అగ్రనేతలు మోదీ వద్దకు తీసుకెళ్లారు. మామూలుగా అయితే మోదీ అంత ప్రాధాన్యం ఇవ్వరని.. తెలంగాణ విషయంలో ప్రత్యేకంగా దృష్టిపెట్టబట్టే కార్పొరేటర్లను పిలిపించి మరీ దిశానిర్దేశం చేశారని భావిస్తున్నారు. తెలంగాణలో విజయం సాధించాలంటే.. గ్రేటర్ తో పాటు చుట్టుపక్కల విజయం సాధించడం కీలకం. గతంలో ఎప్పుడూ లేనంతగాబీజేపీ విజయం సాధించింది. ఈక్రమంలో కార్పొరేటర్ల పాత్ర వచ్చే ఎన్నికల్లో కీలకం కానుంది. వారిలో నుంచి కొంత మంది ఎమ్మెల్యే అభ్యర్థులు రావడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ పరిస్థితులపై బీజేపీహైకమాండ్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సమాచారం తెప్పించుకుని మరీ.. అంతర్గత సూచనలు పంపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు.. తీసుకోవాల్సినజాగ్రత్తులు .. అమలు చేయాల్సిన వ్యూహాలపై మోదీ దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ నేతల పనితీరు పట్ల మోదీ సంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్‌కు.. రెండు, మూడు సార్లు వివిధ సందర్భాల్లో ఫోన్ చేసి అభినందనలు కూడా తెలిపారు.

 

Tags: Lotus Road Map for Telangana