Natyam ad

అసంతృప్తితో పాటు కమలం  సీనియర్లు

హైదరాబాద్ ముచ్చట్లు:


అంబర్‌పేట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ అగ్ర నేతల తీరుతో నియోజకవర్గంలోని పలువురు సీనియర్‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సదరు నేతలు అగ్ర నేతల వైఖరితో ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు బీజేపీ అభ్యర్థి ఆలె నరేంద్రను, మూడు పర్యాయాలు గంగాపురం కిషన్ రెడ్డిని పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి గెలిపించారు.సికింద్రాబాద్ లోక్ సభ సభ్యుడిగా కిషన్ రెడ్డి విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. గత 30 సంవత్సరాల నుండి క్రియాశీల కార్యకర్తలుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి, పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్న తమ పట్ల అగ్ర నేతలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.పార్టీ సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలకు తమను ఆహ్వానించకపోవడం, పార్టీ కీలక పదవులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇస్తున్నారనే ఆరోపణలతో సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమాలపై కూడా తమకు సమాచారం ఇవ్వడం లేదని సదరు నేతలు బహిరంగంగానే వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి నేతలు వివిధ పార్టీలలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గోల్నాక డివిజన్ బీజేపీ అధ్యక్షుడు, సీనియర్ నేత నర్సింగ్ రావు యాదవ్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.తాజాగా అంబర్ పేట నియోజకవర్గంలోని 5 డివిజన్లకు చెందిన మరో పదిమంది కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.

 

 

 

ప్రధానంగా బాగ్ అంబర్ పేట్, నల్లకుంట, కాచిగూడ డివిజన్లకు చెందిన ఇద్దరు మైనార్టీ నేతలు, 5 మంది బీసీ నేతలతో పాటు మరో ముగ్గురు నాయకులు వేరే పార్టీలో చేరేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. కొందరు నాయకులు టీఆర్ఎస్ అగ్రనేతలను కలిసి చర్చలు జరిపి త్వరలో ఆయా పార్టీల్లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. సెంట్రల్ జిల్లా బీజేపికి ఇతర పార్టీల్లో చేరికలపై సమాచారం అందడంతో పార్టీ నాయకులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది.నియోజకవర్గంలో ఇలాగే కొనసాగితే రాబోవు ఎన్నికల్లో బీజేపీ గెలుపు కష్టమేనని పలువురు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలకు హడావుడిగా పదవులు కట్టబెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి అంబర్ పేట్ నియోజకవర్గాన్ని పట్టించుకునే పాపను పోలేదని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గం పై దృష్టి సారించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ నాయకులు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు.

 

Post Midle

Tags: Lotus  seniors with dissatisfaction

Post Midle

Leave A Reply

Your email address will not be published.