శేరలింగం పల్లిలో కమలం బలహీనతలు

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలంగాణలో బీజేపీ బలపడేకొద్ది…బలహీనతలు కూడా బయటపడుతున్నట్లు ఉన్నాయి. ఎలాగైనా కేసీఆర్ ని గద్దె దించి తెలంగాణగడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని కమలనాథులు గట్టిగానే కష్టపడుతున్నారు…తమకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా బీజేపీ పనిచేస్తుంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో కమలం పార్టీ బాగా బలపడింది…దానికి ఉదాహరణ ఇటీవల వచ్చిన సర్వే..టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా బీజేపీ ఎదిగింది.అయితే ఇలా బలపడుతున్న పార్టీలో సీటు కోసం పోటీ పెరుగుతుంది…అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎలాగైనా బీజేపీలో సీటు దక్కించుకోవాలని చాలామంది నేతలు ట్రై చేస్తున్నారు. ఇలా పోటీ వాతావరణం ఉంటే బాగానే ఉంటుంది..కానీ సీటు కోసం గ్రూపు రాజకీయం చేస్తేనే అసలుకే ఎసరు వస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో సీట్ల లొల్లి తారస్థాయికి చేరుకుంది…చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తోంది.ఇలా ఆధిపత్య పోరు అనేది పార్టీన బలపర్చడం కంటే బలహీనపరుస్తుంది…అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ బలం  నిదానంగా తగ్గుతూ వస్తుంది. అయితే బీజేపీలో కూడా ఆధిపత్య పోరు ఎక్కువగానే కనిపిస్తోంది. కొన్ని సీట్లలో నేతలు డైరక్ట్ గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేవరకు వెళుతుంది.

 

 

ముఖ్యంగా శేరిలింగంపల్లి, పటాన్ చేరు నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయం ఎకువ నడుస్తోంది.ఈ రెండు చోట్ల బీజేపీ బలపడింది. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి..కానీ ఈ సీట్లలోనే పోటీ ఎక్కువ ఉంది. శేరిలింగంపల్లి సీటు కోసం బీజేపీ నేత యోగానంద్, సీనియర్ నేత బిక్షపతి యాదవ్ తనయుడు రవి యాదవ్ గట్టిగా పోటీ పడుతున్నారు. ఈ మధ్య ఓ సమావేశంలో ఇరు వర్గాలు బాహాబాహీకి కూడా దిగాయి…అయితే వీరికి బీజేపీ అధిష్టానం క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది.అటు పటాన్ చెరు సీటు కోసం మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, యువ నేత శ్రీకాంత్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతారు..అలాగే రెండు గ్రూపులుగా విడిపోతే…నెక్స్ట్ ఎన్నికల్లో ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించరు..దీని వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది..కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం. అందుకే ఈ అంతర్గత పోరుకు వెంటనే చెక్ పెట్టేయాలి.

 

Tags: Lotus Weaknesses in Seralingam Palli

Leave A Reply

Your email address will not be published.