ఎత్తులకు పైకి ఎత్తులలో కమలం నేతలు
హైదరాబాద్ ముచ్చట్లు:
మునుగోడు పోరుకు కమలదళం సిద్ధమవుతున్నది. అధికార పార్టీని దెబ్బ కొట్టేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేసేందుకు రెడీ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్యే పదవికి త్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజక వర్గానికి ఉప ఎన్నిక ఖాయమని తెలుస్తున్నది. ఈ బై పోల్‌లో బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని యోచిస్తున్నది. అటు గెలుపోటములను తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పాటు హుజురాబాద్‌ను ఉదాహరణగా చూపనున్నారు. దళితబంధు వచ్చింది తమవల్లేనని క్లెయిమ్ చేసుకున్న బీజేపీ ఈ ఎన్నికల కోసం వచ్చే పథకాలు, స్థానిక అభివృద్ధిని కూడా తమకు అనుకూలంగా మార్చుకోనున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ సిద్ధమవుతున్నది. ఈ ఎన్నికల్లో్ ద్విముఖ్య వ్యూహంతో ముందుకు వెళ్లనున్నది. గెలిచినా, ఓడినా తమకు అనుకూలంగా మల్చుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నది. గెలవడం పక్కా అని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నా..అనుకోని కారణం వల్ల ఓడినా అది తమకు ప్లస్సే కానీ మైనస్ ఏమీ కాదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ బైపోల్లో గెలిస్తే.. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేననే విషయం స్పష్టమవుతున్నదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే.. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని, వచ్చే ఎన్నికలకు సిద్ధం కావొచ్చని భావిస్తున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పని ఖతమైందని, ఉన్న నేతలు కూడా పార్టీ వీడుతున్నారనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నది.తెలంగాణలో అత్యంత కాస్ట్ లీ ఎలక్షన్‌గా హుజురాబాద్ నిలిచింది. ఆత్మాభిమానం, అహంకారానికి నడుమ జరిగిన ఎన్నిక అని బీజేపీ ప్రజల్లోకి వెళ్లి సక్సెస్ అయింది. ఒక్క ఈటలను ఓడించేందుకు కేసీఆర్ యంత్రాంగం మొత్తాన్ని దించి వందల కోట్లు ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి. రాజేందర్‌ను ఓడించడమే ధ్యేయంగా దళితబంధు పథకం తీసుకొచ్చారు. ఆ పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని ఆయా నియోజకవర్గాల ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది. ఇప్పుడు ఇదే అంశాన్ని బీజేపీ లేవనెత్తనున్నది. మునుగోడు ప్రజా సంక్షేమం, అభివృద్ధి, కొత్త పథకాల కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లారని చెబుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది.
Tags: Lotus weavers in the heights above the heights