ప్రేమ వ్యవహారం…తల్లిపై కాల్పులు

Date:22/02/2020

గుంటూరు  ముచ్చట్లు:

జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. చెరుకుపల్లి మండలం నడింపల్లిలో రమాదేవి అనే మహిళపై సైనికోద్యోగి బాలాజీ కాల్పులు జరిపాడు.  రమాదేవి కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ బాలాజీ వెంటపడుతున్నాడు.  రమాదేవి ఒప్పుకోకపోవడంతో శనివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చి నాటు తూపాకితో కాల్పులు జరిపాడు.  అప్రమత్తమై రమాదేవి పక్కుకు తప్పుకునే క్రమంలో కుడి చెవి మీదుగా తూటా దూసుకెళ్లింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని రమాదేవిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితుడు బాలాజీ పరారీలో వున్నాడు. బాలాజీని తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అప్పుడు గుర్తుకు రాలేదా

Tags: Love affair … fire on mother

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *