ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట..
-ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంటది అనంతపురం జిల్లా
-చావులోను ఒక్కటిగా కలసి ప్రాణాలు విడచిన ప్రేమజంట.
అన్నమయ్య ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా, మదనపల్లి అబ్బగొంది అడవిలో ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంటది అనంతపురం జిల్లా అని రూరల్ సీఐ.సత్యనారాయణ సోమవారం ఉదయం మీడియాకు తెలిపారు.అనంతపురం జిల్లా, కూడేరు మండలం, ఉదురిపికొండకు చెందిన బోయ రమణ కుమార్తె బి.వినీషా 17, అదేఊరికి చెందిన ధనంజయ కొడుకు ముత్తులూరు వెంకట నాయుడు 28గా దర్యాప్తులో తేలిందన్నారు. మృతులు ఈనెల9 రాత్రి ఇంటి నుండి పారిపో
వచ్చేసి మదనపల్లి అబ్బగొంది అడవిలో చున్నీతో ఉరేసుకుని మృతి చెందారన్నారు.ప్రేమ జంట ఆత్మహత్య కు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సివుంది.
Tags; Love couple who committed suicide..
