Date:14/12/2019

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం లో ఇద్దరు యువతీ యువకులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పెనుగొలకల గ్రామానికి చెందిన అమర్నాథ్ అనే యువకుడితో పాటు త్రిపుర రాష్ట్రానికి చెందిన ఓ యువతి పెనుగొల కల గ్రామంలో పంట పొలంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయారు. అమర్నాథ్ కు గతంలోనే మదనపల్లె రూరల్ గ్రామానికి చెందిన సంధ్యారాణి తో వివాహం జరిగినది .అయితే వృత్తిరీత్యా బెంగళూరులో హోటల్ లో పనిచేస్తున్న సమయంలో త్రిపుర రాష్ట్రానికి చెందిన అంజలి నాథ్ తో పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరు వివాహం చేసుకున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో మొదటి భార్యతో కుటుంబ కలహాలు రావడంతో అమర్నాథ్ అంజలి నాథ్ ఇద్దరు కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది .పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

క్షేత్రస్థాయి ప్రత్యక్ష పరిశీలన మీదటే మున్సిపల్ వార్డు హద్దులు నిర్ణయించాలి

Tags: Love is suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *