ప్రేమ- పెళ్లి- మోసం

నిజామాబాద్ ముచ్చట్లు:

 

మహిళల అనాలోచితంతో చిద్రం అవుతున్న కుటుంబాలు,ఓమహిళను  ప్రేమించి పెళ్లి చేసుకొని మోసగించిన అటవీ శాఖ ఉద్యోగి,పట్టుమని పది రోజులు గడవక ముందే నవదంపతుల ఆత్మహత్య యత్నం ఘటన ఈ రెండు ఘటనలలో మహిళల తొందరపాటు తో జరిగిన ఘటనలే నిజామాబాద్ జిల్లలో చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన కృష్ణగీత్‌,ఫారెస్ట్‌ ఆఫీసులో సెక్షన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన  యువతితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అయితే సంవత్సరం క్రితం ఆయువతిని రహస్యంగా పెళ్లి చేసుకున్న కృష్ణగీత్‌.. తమ తమ ఇంట్లో విషయం ఎవరికీ తెలియకుండా ఇద్దరూ జాగ్రత్త పడ్డారు.అయితే నెల క్రితం సదరు యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో విషయాన్ని కృష్ణగీత్‌కు చెప్పింది. దీంతో మొదటగా ఇంట్లో పెద్దలు చూసిన పెళ్లి చేసుకోవాలని, తర్వాత తాను వచ్చి తీసుకెళ్తానని నమ్మించాడు. నమ్మిన యువతి నెల రోజుల క్రితం మరో పెళ్లి చేసుకుని తర్వాత కృష్ణగీత్‌ వద్దకు రాగా.. ఆమెను తీసుకెళ్లి వేరే ఇంట్లో కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను తీసుకొచ్చేందుకు వెళ్లగా.. అసలు వ్యవహారం బయట పడింది. ఆ యువతికి సంవత్సరం క్రితమే కృష్ణగీత్‌తో పెళ్లి జరిగినట్టు తెలుసుకొని షాక్‌కు గురయ్యారు. చివరకు కృష్ణగీత్‌ ఇంట్లోనే వదిలిపెట్టి వచ్చారు.

 

 

అయితే, కృష్ణగీత్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు సైతం యువతిని తమ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వేధింపులకు గురి చేస్తుండడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం ఫినాయిల్‌ తాగింది. వెంటనే ఆమెను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా.. కృష్ణగీత్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీస్ లను వివరణ కోరగా ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.సాంకేతిక విప్లవం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన వేల పెద్ద కుటుంబాలు అంతరించి పోయి చిన్న కుటుంబాలు మేలు అనే ప్రచారం జోరందుకున్న తరుణంలో ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరం.నిజామా బాద్ జిల్లాలో పచ్చల నడుకుడ గ్రామంలోవారం రోజుల క్రితం పెళ్ళైన నవ దంపతులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.పురుగుల మందు సేవించి అస్వస్థత కు గురైన జంట ను స్థానికులు ఆసు పత్రికి తరలించారు.వేల్పూరు మండలం పచ్చల నడుకుడ కు చెందిన భీమ్ రావు మాక్లూర్ మండలం మానిక్ బండార్ కు చెందిన స్వాతి తో ఈ నెల 13 న వివాహం జరిగింది.

 

 

 

అర్ధరాత్రి బీరులో పురుగుల మందు కలుపుకుని సేవించారు.భర్త గంధం భీమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లగా, స్వాతితో పోలీసులు మాట్లాడగా.. పెళ్లి తనకు ఇష్టం లేదని, బలవంతంగా చేశారని తెలిపింది.కలిసి జీవించలేం, కలిసి చనిపోదామని తాను పురుగుల మందు తాగి భర్తకు గ్లాసులో ఇచ్చి తాగించినట్లు వాగ్మూలం ఇచ్చినట్లు పోలీస్ లు తెలిపారు..ఐతే ఈ ఘటనలో చికిత్సపొందుతూ భర్త బిమ్ రావు మృతిచెందాడు.ఎలా కలిసి ఉండాల్సిన వీరుచివరికి కన్నా తల్లి దండ్రులకు కడుపు కోతని మిగిల్చింది కొత్తగా వచ్చిన కోడలు.కథలు ఎవైన చివరికి ఆడవాళ్ళ చేతిలో మగాళ్ళు బలవుతున్న ఘటనలు కోకొల్లలు.ఎందులో కొన్నే బయటకు వస్తాయి …ఏదేమైనా ఎలాంటి ఘటనలు జరగటం సమాజానికి ఎలాంటి సంకేతాలకు దారితీస్తాయో మరి.క్షణికావేశంలో మహిళల నిర్ణయాల వాళ్ళ కుటుంబాలు చిద్రమవుతున్న ఘటనలు ఎన్నో అలాంటి ఘటనలకు పాల్పడుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న యువత, ఆలోచన చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాద్యత తల్లి దండ్రుల పెంపుకంతోనే మొదలవుతునేది మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ప్రతి మనిషి గ్రహించాల్సిన అవసరం ఉంది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Love- Marriage- Cheating

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *