ప్రేమ పెళ్లి…మాయం

హైదరాబాద్  ముచ్చట్లు :

ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానంటూ వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాలేదు. ఆమె ఆచూకీ కూడా దొరకలేదు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాలగూడకు చెందిన కాశీనాథ్‌ కూతురు అనూష(27) ఓ యువకుడిని ప్రేమించింది. ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆమె ప్రేమకు ఒప్పుకొని వివాహానికి అంగీకరించారు.అయితే రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటామని అనూష చెప్పడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. దీంతో రిజిస్టర్‌ వివాహం చేసుకోవడానికి ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిన అనూష తిరిగి రాలేదు. ఆమె సెల్‌ఫోన్‌ కూడా స్విచ్ఛాప్‌ వచ్చింది. దీంతో ఆమె ఆచూకీ కోసం అంతటా వెతికారు. దీంతో చివరకు ఈ నెల 20 వ తేదీ రాత్రి అనూష తండ్రి కాశీనాథ్‌ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags:Love married … ate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *