ఏపీ పట్ల సవతి తల్లి ప్రేమ 

Love step mother towards AP

Love step mother towards AP

Date:09/10/2018
అమరావతి  ముచ్చట్లు:
వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం ఏపి పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. ప్రధాని మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.  వెనుకబట్టిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో మోడీకి ఎందుకు అంత కక్ష. బిజెపి రాష్ట్ర నాయకత్వం వెనుకబడిన జిల్లాల నిధుల విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు?
ఎందుకు వారికంత బలహీనత అని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వరు, పోలవరం నిర్వాసితులకు ప్యాకేజ్ విషయంలో కూడా కేంద్రం మాట్లాడటం లేదు. బిజెపి రాష్ట్రానికి చేస్తున్న  మోసం పై పవన్, జగన్ ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు భయపడుతున్నారు? జగన్ శత్రువు కాదని పవన్ అంటున్నారు.. రాజకీయాల్లో శత్రువులు ఎవరు ఎవరికి ఉండరు.
జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ తేల్చిన లెక్కల విషయంలో కేంద్రాన్ని పవన్ ఎందుకు నిలదీయరని నిలదీసారు.  స్వామినాథన్ కమిషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ను అవార్డ్ కు సిఫార్సు చేయటం గొప్ప విషయం. అవినీతిపరులతో నా స్నేహం లేదు అంటున్నారు. మరి అవినీతిపరుడైన జగన్ మీకు శత్రువు ఎలా కాకుండా పోయాడు. తెలంగాణ లో వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజ్ ఇవ్వటానికి మేం వ్యతిరేకం కాదు, అది తెలంగాణ హక్కు.  తెలంగాణ కు ప్యాకేజ్ ఇచ్చి ఏపి కి ఎందుకు ఇవ్వటం లేదు. జరుగుతున్న అన్యాయం పై మాతో పాటు పవన్, జగన్ కూడా పోరాడాలని అన్నారు.
Tags:Love step mother towards AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed