Love story

మనసుని తాకే ప్రేమ కథ ‘ఇద్దరిలోకం ఒకటే’

Date:25/12/2019

హైదరాబాదు ముచ్చట్లు:

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌. తన కెరీర్‌లో తరువాత ఒకటి రెండు హిట్స్‌ వచ్చినా హీరోగా తన ఇమేజ్‌ను కాపాడుకోవటంలో ఈ యువ నటుడు ఫెయిల్ అయ్యాడు. కథల ఎంపిక, మాస్‌ హీరోగా ప్రూవ్‌ చేసుకోవాలన్న ఆరాటంలో రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ గాడి తప్పింది. దీంతో కొంత గ్యాప్ తీసుకొని కొత్త తరహా పాత్రలో, తన రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన కథతో ఇద్దరి లోకం ఒకటే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథ, దర్శకుడి మీద నమ్మకంతో స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేయటంతో సినిమా మీద మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. మరి ఈ సినిమా అయినా రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ను గాడిలో పెట్టిందా..? రివ్యూలో చూద్దాం.కథ విషయానికి వస్తే మహి (రాజ్‌ తరుణ్‌), వర్ష (షాలిని పాండే) ఓ ప్రమాదం కారణంగా ఒకే సారి ఊటిలోని ఒకే హాస్పిటల్‌లో జన్మిస్తారు. ఆ తరువాత ఎనిమిదేళ్ల వయసులో ఆ ఇద్దరూ మళ్లీ కలుస్తారు. చిన్నతనంలోనే ఆ పసి హృదయాలు దగ్గరవుతాయి. కానీ వర్ష తాతయ్య (నాజర్‌) చనిపోవటంతో వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో మహి, వర్షాలు దూరమవుతారు.18 ఏళ్ల తరువాత మహి, తన తండ్రి బాటలోనే ఫోటో గ్రాఫర్‌గా మారి సొంతంగా ఓ ఫోటో స్టూడియోను రన్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. వర్ష తాతకిచ్చిన మాట కోసం ఎప్పటికైన నటిగా ప్రూవ్‌ చేసుకోవాలన్న ఆశయంతో హీరోయిన్‌ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటుంది. మహి ఏర్పాటు చేసిన ఓ ఫోటో ఎగ్జిబిషన్‌లో తన చిన్ననాటి ఫోటోను చూసిన వర్ష తిరిగి మహితో స్నేహం చేస్తుంది. వర్ష హీరోయిన్‌గా అవకాశం సంపాదించటంతో మహి హెల్ప్ చేస్తాడు.

 

 

 

 

 

 

 

 

 

ఈ ప్రయాణంలో వర్ష, మహి దగ్గరవుతారు. కానీ అప్పటికే రాహుల్‌ (రాజా)తో పెళ్లికి రెడీ అయిన వర్ష, ఎటూ తేల్చుకోలేక మదనపడుతుంది. అదే సమయంలో మహి తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్న విషయం కూడా తెలుస్తోంది. ఈ సమస్యల నుంచి వర్ష, మహి బయట పడ్డారా..? చివరకీ ఈ ప్రేమికులు ఒక్కటయ్యారా..? లేదా..? అన్నదే మిగతా కథ.ఓ సున్నితమైన ప్రేమకథను వెండితెర మీద అందంగా ఆవిష్కరించే ప్రయత్నం చేసిన దర్శకుడు జీఆర్‌ కృష్ణ సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. తను అనుకున్న కథకు అనవసరపు హంగులు, కమర్షియల్‌ ఆర్బాటాలు లేకుండా అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించాడు. ప్రస్తుతం వస్తున్న స్పీడు ట్రెండ్ ప్రేమకథలకు భిన్నంగా మనసును తాకే ఎమోషన్స్‌తో హడావిడిలేని భావాలను తెర మీద పలికించాడు. టర్కిష్‌ సినిమాకు రీమేక్‌ అయినా.. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా ఆ భావన కలగదు. నటీనటుల నుంచి తను అనుకున్న పర్ఫామెన్స్‌ రాబట్టడంలోనూ దర్శకుడి ప్రతిభ తెరమీద కనిపిస్తుంది. అయితే తను అనుకున్న పాయింట్‌ను మరింత పొయటిక్‌గా చెప్పే ప్రయత్నంలో కథనాన్ని నెమ్మదిగా నడిపించిన భావన కలుగుతుంది.ఎప్పుడు అల్లరి పాత్రలో కనిపించే రాజ్‌ తరుణ్‌ ఈ సినిమాలో హుందాగా నటించాడు. తన స్టైల్‌ హై సీన్స్‌ లేకుండా సెటిల్డ్‌ పర్మాఫెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే రాజ్‌ తరుణ్‌కు ఉన్న ఇమేజ్‌ కారణంగా అక్కడక్కడ పాత్రకు సూట్‌ అవ్వలేదేమో అనిపిస్తుంది.

 

 

 

 

 

 

 

 

రాజ్‌ తరుణ్‌ మార్క్‌ ఎనర్జీ ఈ క్యారెక్టర్‌లో మిస్‌ అయ్యింది. అర్జున్‌ రెడ్డి తరువాత షాలిని పాండే మరోసారి బెస్ట్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. బబ్లీ గర్ల్‌గా కనిపిస్తూనే.. లవ్‌, ఎమోషన్స్‌ను అద్భుతంగా పలికించింది. ఇది తన కెరీర్‌లో మరో బెస్ట్ పర్మామెన్స్‌ అనటంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్‌ తల్లిగా రోహిణి మరోసారి తనదైన పర్ఫామెన్స్‌తో కంటతడిపెట్టించింది. హీరో ఫ్రెండ్‌ పాత్రలో నటించిన భరత్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో పర్వాలేదనిపించాడు. సీనియర్‌ నటుడు నాజర్‌ తన అనుభవంతో తన పాత్రకు ప్రాణం పోశాడు.సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. సినిమాకు ప్రధాన బలం సినిమాటోగ్రఫి ఊటీ అందాలను తన కెమెరాలో అద్భుతంగా బంధించాడు సినిమాటోగ్రాఫర్‌ సమీర్‌ రెడ్డి. దర్శకుడి మనసుల్లో ఉన్న విజువల్‌కు తన కెమెరా కన్నుతో తెర రూపం ఇచ్చాడు. సమీర్‌ రెడ్డి ఫ్రేమ్స్‌, లైటింగ్‌ సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చాయి. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌ నిరాశపరిచాడు. ప్రేమకథకు ప్రధాన బలం కావాల్సిన సంగీతం, స్పీడు బ్రేకర్‌లా మారింది. పాటల విషయంలో నిరాశపరిచిన మిక్కీ నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సన్నివేశాలు సుధీర్ఘంగా సాగుతూ భారంగా అనిపిస్తాయి. దిల్‌ రాజు ఓ పొయటిక్‌ లవ్‌ స్టోరినీ తెర చూపించేందుకు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రూపొందించాడు.ఓవరాల్‌గా ఇద్దరి లోకం ఒకటే.. అక్కడక్కడా భారంగా అనిపించినా మనసును తాకే ప్రేమ కథ.

 

మైనర్ బాలికపై  అత్యాచారం

 

Tags:Love story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *