ప్రేమించి పెళ్లి చేసుకుని భర్త మోసం చేశాడు.

పలమనేరు  ముచ్చట్లు:

ప్రేమించాడు ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఆఖరుకు మోసం చేశాడని ఓ అభాగ్యురాలు భర్త కోసం అన్వేషిస్తున్న పరిస్థితి సోమవారం పలమనేరు పట్టణంలో గల జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ నాయకులకు ఆమె గోడు వివరించినప్పుడు బయటపడింది. బాధితురాలు శ్రీదేవి తెలిపిన వివరాల మేరకు తిరుపతి పట్టణంలో బ్లిస్ సమీపములో నివాసముంటున్న శ్రీదేవి ఉద్యోగరీత్యా సిద్ధార్థ కళాశాలలో రిసెప్షన్ సెంటర్ నందు విధులు నిర్వహిస్తున్న సందర్భంలో చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం నారాయణ వనానికి చెందిన వీరన్ కుమారుడు రామచంద్రన్ అదే కళాశాలలో ప్రిన్సిపాల్ కారు డ్రైవర్గా విధులు నిర్వహించే వాడిని వివరించారు. ఆ సందర్భంలో తనకు అతనికి పరిచయమై ఆ తర్వాత ప్రేమగా మారి ఓ దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నామని తెలిపారు. సుమారు ఆరు నెలల పాటు మేమిద్దరమూ భార్యాభర్తలుగా దాంపత్య జీవితం చేశామని, ఈ విషయం తెలుసుకున్న తన భర్త తల్లిదండ్రులు , అతని మేనత్త లక్ష్మి మేము కాపురముంటున్న ప్రాంతానికి వచ్చి , తన భర్త రామచంద్రునకు లేనిపోని మాటలు వల్లించి, నన్ను భ్రాంతులకు గురి చేసి, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటావా అని తనను ఒంటరి చేసి తన భర్తను నారాయణ వనానికి తీసుకొని వెళ్ళి పోయారని కన్నీరు పెట్టుకుంది.

 

సుమారు సంవత్సరం నుండి తనకు న్యాయం చేయాలని జిల్లా అధికారులు, మండల అధికారులును కాళ్ళు వేళ్ళు పట్టుకున్నా కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేక తన భర్త ఇంటిముందు ఒక్క రోజు పాటు నిరాహార దీక్ష చేసినా ఫలితం దక్కలేదని , మహిళా సంఘాల ద్వారా ధర్నా చేసిన సందర్భంలో తనతో కాపురం చేస్తానని ఒప్పుకొని మోసం వేశాడని ఆరోపించింది. తన భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులు తనకు పెడుతున్న వేధింపులకు తట్టుకోలేక ఆవేదనకు గురై తనతండ్రి మరణించారని, ప్రేమ వివాహం చేసుకున్నందుకు మా కుటుంబ సభ్యులు ఎవరు తనను చేరదీయ లేదని ఆవేదన చెందారు. ఆఖరుకు జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ వారిని ఆశ్రయించి న్యాయం చేయమని కోరారు. తన భర్త హోంగార్డుగా పని చేస్తున్నాననే ధీమాతో పోలీసు అధికారులు కూడా అతనిని రక్షిస్తారనే . ధైర్యంతో ఉండి తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, దయ కలిగిన మహిళ మేధావులు తనకు రక్షణగా నిలిచి నా భర్తను నాకు దక్కింది న్యాయం చేయాలని రెండు చేతులు జోడించి వేడుకుంది.

 

Post Midle

Tags: Loved and married and cheated on husband.

Post Midle
Natyam ad