చెట్ల పొదల్లో ప్రేమికులు..వీడియో తీస్తున్న వ్యక్తి అరెస్ట్
సూర్యాపేట ముచ్చట్లు:
ప్రేమ జంటల వీడియోలు రహస్యంగా తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…….. ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ అనే యువకుడు ఉండ్రుగొండ గుట్టల్లోని చెట్ల పొదల్లో ప్రేమికులు ఉండగా వారు ఏకాంతంలో ఉండే వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నాడు. దీంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గత సంవత్సర కాలంగా ఇలాంటి వీడియోలు తీస్తూ ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడి ఫోన్ సుమారు 100 ప్రేమ జంటల ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించి యువకుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు రహస్య విచారణ చేపడుతూ రామకృష్ణ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేస్తున్నారు. చివ్వెంల ఎస్సై పి. విష్ణు ఉండ్రుగొండ సర్పంచ్ శైలజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
Tags: Lovers in the bushes..The person taking the video was arrested