Natyam ad

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం

-నాగపట్టణం, తూత్తుక్కుడి, పాంబన్‌ హార్బర్లలో ఒకటో నెంబరు తుఫాను హెచ్చరికను జారీ

చెన్నై  ముచ్చట్లు:


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు ఉత్తర తమిళనాడు కోస్తా తీరంపై ఆవహించివున్న ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడివుంది. ఇది మరింతగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో నాగపట్టణం, తూత్తుక్కుడి, పాంబన్‌ హార్బర్లలో ఒకటో నెంబరు తుఫాను హెచ్చరికను జారీ చేశారు. వాతావరణంలో మార్పుల కారణంగా డెల్టా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా అధికారుల హెచ్చరిక నేపథ్యంలో నాగపట్టిణం జిల్లాకు చెందిన దాదాపు 20 వేల మంది జాలర్లు సముద్రంలోకి వెళ్ళలేదు. అలాగే, 27 జాలర్ల గ్రామాల్లో జాలర్లకు చెందిన ఆరు వేల ఫైబర్‌ బోట్లు చేపల వేటకు దూరంగా ఉన్నారు.

 

Post Midle

Tags:Low pressure formed in Bay of Bengal is likely to become a cyclone

Post Midle