బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం ముచ్చట్లు:


వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రతో పాటు, కృష్ణ, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో తేలికపాటి వర్షాలు నమోదయ్య అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు రానున్న మూడు రోజులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.

 

Tags: Low pressure in Bay of Bengal

Leave A Reply

Your email address will not be published.