Natyam ad

బంగాళాఖాతలంలో అల్పపీడనం

విశాఖపట్టణం ముచ్చట్లు:


క్షిణ అండమాన్ సముద్రంలో డిసెంబర్ 04 ,2022 న ఉపరితల ఆవర్తనం ఉద్బవించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో, ఆగ్నేయ బంగాళాఖాతంలో దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో డిసెంబర్ 05 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ డిసెంబర్ 07 ఉదయం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కొనసాగుతూ నైరుతి బంగాళాఖాతనికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి దాని అనుకోని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు డిసెంబర్ 08 ఉదయం నాటికీ చేరుకుంటుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణం లో ఈశాన్య మరియు తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో ఏపీలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది,
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు
ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈ రోజు, రేపు, ఎల్లుండి :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈ రోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు,  ఎల్లుండి :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
రాయలసీమ :-
ఈ రోజు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

 

Tags; Low pressure in the Bay of Bengal

Post Midle
Post Midle