వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం  మధ్యభారతంలోని చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు

న్యూఢిల్లీ ముచ్చట్లు:
వాయవ్య బంగాళాఖాతం శుక్రవారం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తూర్పు, మధ్యభారతంలోని చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా పశ్చిమ, ఈశాన్య దిశగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. మరో వైపు రాబోయే 24 గంటల్లో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌, బిహార్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని, ఇందుకు అవసరమైన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పింది.అల్పపీడనానికి అనుబంధంగా పశ్చిమ గాలులు బలపడడంతో శుక్రవారం నుంచి 15వ తేదీ వరకు మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాల్లో విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శనివారం నుంచి 15 వరకు కేరళలో అక్కడక్కడ భారీ వర్షాపాతం ఉంటుందని చెప్పింది. 12-15 కొంకణ్‌ మీదుగా భారీ వర్షాపాతం ఉంటుందని పేర్కొంది. అలాగే ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, బెంగాల్‌, జార్ఞండ్‌, బీహార్‌లో వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని చెప్పింది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Low pressure in the northwestern Bay of Bengal
Abundant rainfall over most parts of Central India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *