Natyam ad

తమిళనాడు వైపుగా అల్పపీడనం- దక్షిణ కోస్తాంధ్ర పై భారీ ప్రభావం.

తమిళనాడు ముచ్చట్లు:

దక్షిణ కోస్తాంధ్ర అంటేనే మనకు గుర్తొచ్చేది నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలు. సాధారణంగా అల్పపీడనం ఈశాన్య రుతుపవనాలలో వచ్చినప్పుడు తమిళనాడు వైపుగా తిరుపతి, నెల్లూరు, అలాగే రాయలసీమ జిల్లాల్లోని తూర్పు భాగాలతో పాటుగా ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో భారీ వర్షాలు చూస్తాం. కానీ ఈసారి అల్పపీడనానికి ఉత్తర భాగంలో ఉపరితల ఆవర్తనం ఉండటం వలన వర్షాలు మరింత తీవ్రంగా కోస్తా భాగాల్లో ఉంటుంది.అక్టోబర్ 31 రాత్రి నుంచి వర్షాలు మొదలౌవ్వనుంది. అంత వరకు వర్షాలు తక్కువగానే ఉంటుంది. అక్టోబర్ 31 అంటే తెల్లవారినుంచే పడదు. అక్టోబర్ 31 రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో మొదట నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లోకి అడుగుపెట్టనుంది. ఆ తర్వాత నవంబర్ 1, 2, 3 మరియు నవంబర్ 4 వరకు ఈ వర్షాలు కొనసాగనుంది. కానీ నవంబర్ 1 మరియు నవంబర్ 2 అత్యధికంగా ఉండనుంది.

ఎక్కడెక్కడ ఎలా ఉండనుంది ?

వర్షాలు అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ప్రాంతాల్లో అతిభారీ । తీవ్రమైన వర్షాలు పడే అవకాశాలుంటుంది. ఉదాహరణకి కృష్ణపట్నం, మైపాడు, తూపిలిపాలెం, శ్రీహరికోట ఇలాంటి భాగాల్లో ఎక్కువగా వర్షాలు చూడగలము. మరో వైపున నెల్లూరు నగరం, గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి వైపు మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఈ పై జిల్లాల్లో అత్యధికంగా నవంబర్ 1 మరియు 2 న ఉంటుంది. నవంబర్ 3 మరియు 4 మాత్రం అడపదడపగా ఉంటుంది.ప్రకాశం, అన్నమయ్య జిల్లా తూర్పు భాగాలు, కడప, జిల్లా తూర్పు భాగాల్లో, చిత్తూరు తూర్పు భాగాల్లో బాపట్ల (కోస్తా భాగాలు), కృష్ణా (కోస్తా భాగాలు), కొనసీమ (కోస్తా భాగాలు), పశ్చిమ గోదావరి (కోస్తా భాగాలు) మోస్తరు నుంచి భారీ వర్షాలుంటుంది. ఉదాహరణకి చిట్వేల్, ఒంగోలు, కందుకూరు, బద్వేల్, మచిలీపట్నం, అమలాపురం, నర్సాపురం ఇలా వివిధ భాగాల్లో ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ మాత్రం వర్షాలు నవంబర్ 1 నుంచి వర్షాలు ప్రారంభించి, నవంబర్ 2 నుంచి తగ్గుతూ నవంబర్ 4 కి పూర్తిగా తగ్గుముఖం పట్టనుంది.

 

 

 

Post Midle

మరో వైపున అనంతపురం, సత్యసాయి, నంధ్యాల​, కర్నూలు జిల్లాల్లో నవంబర్ 1 రాత్రి నుంచి లేదా నవంబర్ 2 నుంచి వర్షాలు పెరగనుంది. అలాగే ఎన్.టీ.ఆర్., గుంటూరు, పల్నాడు, ఏలూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి (లోపల భాగాలు), కృష్ణా (లోపల భాగాలు) ల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటుంది. ఇక్కడ మాత్రం నవంబర్ 3 కి వర్షాలు తగ్గుముఖం పట్టనుంది.ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిటికంటే తక్కువగా వర్షాలు పడనుంది. నవంబర్ 2 మరియు నవంబర్ 3 వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అడపదడపగా కొద్దిసేపు వర్షాలుంటుంది. అన్నిటికంటే తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు చూడగలము. ఉత్తర కోస్తాంధ్ర​, గోదావరి జిల్లాల్లో మాత్రం నవంబర్ 2, 3 చలి గాలులు కూడ ఉంటుంది. తెలంగాణలో ఇది వర్షాకాలం కాదు. తెలంగాణ – ఆంధ్ర సరిహద్దు భాగాల్లో మాత్రం చినుకులు ఉండే అవకాశాలున్నాయి. అది కూడ నవంబర్ 2, 3 తేదీల్లో.ఇది రానున్న రోజుల్లో జరగబోయే వాతావరణం. నాకు తెలిసి ప్రతి జిల్లా వాతావరణ పరిస్ధితిని చూపించాను.

 

Tags: Low pressure towards Tamil Nadu – Heavy impact over South Coastal Andhra.

Post Midle