– రెడ్డెమ్మకు అధికారం
-బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి దంపతులకు సన్మానం
Date:08/12/2019
బైరెడ్డిపల్లె ముచ్చట్లు:
వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి, మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడైన బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి , ఆయన సతీమణి డీసీసీబి పర్శన్ ఇన్చార్జ్ రెడ్డెమ్మ దంపతులను సన్మానించారు. పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డెప్ప, పుంగనూరు లయన్స్క్లబ్ జిల్లా పీఆర్వో డాక్టర్ శివ , మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, జెఏసీ చైర్మన్ వరదారెడ్డి, న్యాయవాది పి.ఎన్.ఎస్.ప్రకాష్, వ్యాపారవేత్త గోపాలకృష్ణ కలసి కృష్ణమూర్తి దంపతులను సన్మానించారు. నూతన పర్శన్ ఇన్చార్జ్గా నియమితులైన రెడ్డెమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో తమకు పదవి లభించిందని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పదవిని అప్పగించారని తెలిపారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండ పనిచేస్తామన్నారు. ముఖ్యమంత్రికి ద న్యవాదాలు తెలిపారు.
మైనార్టీ వివాహా వేడుకల్లో మంత్రిగారి సతీమణి
Tags: Loyalty is up to you