Natyam ad

శ్రీ రంగనాథ స్వామి ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన లయోలా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

తిరుపతి ముచ్చట్లు:
 
పులివెందులపట్టణం లో వెలసిన పురాతన ఆలయమైన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో పరిసరాలను పులివెందుల లయోలా డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు శనివారం శుభ్రం చేశారు. లయోలా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ అమల్ రాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నరాల శ్రీనివాసరెడ్డి , స్కౌట్ మాస్టర్ గూడా సాయి నరేంద్ర కుమార్ రెడ్డిల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 5 గంటలపాటు శ్రమించి వారంతా ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు చెత్తాచెదారాన్ని తొలగించి కాల్చివేశారు. ఆలయం ఈవో వెంకటరమణ ఆహ్వానం మేరకు వారంతా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృషిని ఆలయం ఈ ఓ వెంకటరమణ ప్రశంసించారు. ప్రిన్సిపాల్ ఫాదర్ అమల్ రాజు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సేవా కార్యక్రమాలను అలవర్చుకోవడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు.సామాన్య జనం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా విద్యార్థులకు వెంకటరమణ ఏర్పాటు తేనీటి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ కడప జిల్లా శాఖ అధ్యక్షులు అల్లం రంగనాయకులు, ఆలయ అధికారులు విశ్వనాథరెడ్డి, పురుషోత్తం, ఆలయ అర్చకులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Loyola NSS students cleaning the surroundings of Sri Ranganathaswamy Temple