పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్
న్యూ డిల్లీ ముచ్చట్లు:
పాకిస్థాన్ తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఖమర్ జావెద్ బజ్వా ఈ నెల చివరిలో పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం తదుపరి ఆర్మీ చీఫ్‌గా అసిమ్ మునీర్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి వెల్లడించారు.ఆర్మీ చీఫ్‌గా 2016 నవంబరు 29న బజ్వా బాధ్యతలు చేపట్టారు. ఆరేళ్లపాటు పదవిలో కొనసాగిన ఆయన ఈ నెలలో పదవీ విరమణ పొందనున్నారు. కాగా, బజ్వా ప్రస్తుతం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, బజ్వా కుటుంబసభ్యుల సంపద మాత్రం గత ఆరేళ్లలో అమాంతం పెరిగిపోయింది. ఈ మేరకు ఆదాయ పన్ను రికార్డుల ఆధారంగా ఫ్యాక్ట్ ఫోకస్ వెబ్‌సైట్ సంచలన కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం దేశ, విదేశాల్లో ఉన్న బజ్వా ఆస్తుల ప్రస్తుత విలువ రూ.1,270 కోట్లు. ఇది ఆదాయ పన్ను శాఖకు తెలియజేసిన విలువ మాత్రమే అని కథనంలో పేర్కొంది
Tags; Lt. Gen. Asim Munir as Pakistan Army Chief

