పుంగనూరులో పశువులకు లంపీస్కీన్ వ్యాధిని నియంత్రించాం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు డివిజన్ పరిధిలో పశువులకు లంపిస్కీన్ వ్యాధిని నియంత్రించామని ఏడి మనోహర్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో లంపిస్కీన్ వ్యాధి సోకడంతో పశువుల సంతను గత మూడు నెలలుగా నియంత్రించి , వ్యాధి నివారణ కావడంతో పశువుల సంతను ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు 18,179 పశువులకు వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. పత్రికల్లో పశువులు చనిపోతున్నాయని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఇలాంటి వ్యాధి ఉన్న, పశువులు చనిపోయిన తమకు తెలియజేయాలని ఆయన కోరారు.
Tags: Lumpyskin disease in cattle has been controlled in Punganur

