Natyam ad

చంద్ర నాటకం ….

రాజముద్ర లేకుండ జగన్‌ ఫోటోతో నకిలి పాసుబుక్కులా
– ఈపాసుపుస్తకం చించేద్దాం అంటు
– కలర్‌ జిరాక్స్ పేపర్లు చించి విసిరేసిన బాబు
– తెనాలి డివిజన్‌ దుగ్గిరాళ్ళ మండలం పూర్ణచంద్రరావుది
– పుంగనూరు సభలో డ్రామా

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ల్యాండ్‌ టైటలింగ్‌ యాక్ట్ పెట్టి , ఒరిజనల్‌ రికార్డులు తన దగ్గర పెట్టుకుని జిరాక్స్లను యజమానులకు ఇస్తున్నాడని , రాజముద్ర లేకుండ జగన్‌ఫోటోతో పాసుపుస్తకాలు జారీ చేస్తారా..? నేను వీటిని రద్దు చేస్తా…అంటు చంద్రబాబు నాయుడు పుంగనూరులో హైడ్రామా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం గోకుల్‌ సర్కిల్‌లో ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలసి సభ నిర్వహించారు. సభకు జనం రాకపోవడం, వచ్చిన వారి నుంచి బాబు మాటలకు స్పందన రాకపోవడంతో కినుక వహించారు. ఎలాగైన ప్రజలను ఆకట్టుకునేందుకు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. వైఎస్‌.జగన్‌ ర్ఖా•న్ని దోపిడి చేశాడని, భూములను దోచుకునేందుకు తెరతీశాడని పాసుపుస్తకం సభలో చూపించారు. జగన్‌ ఫోటో ఉన్న పాసుపుస్తకాన్ని ఎలా పంపిణీ చేస్తారు…తమాషాగా ఉందా…నేను రాగానే రాజముద్రతో పాసుపుస్తకాలు పంపిణీ చేస్తా…అంటు కలర్‌ జిరాక్స్ పాసుపుస్తకాన్ని చించి సభలో విరిసిపడేశారు. పడేసిన ముక్కల్లో ఉన్న క్యూఆర్‌కోడ్‌ను పరిశీలించగా గుంటూరు జిల్లా ,తెనాలి డివిజన్‌ దుగ్గిరాళ్ళ మండలం, తుమ్మపూడి గ్రామ నివాసి కేశంనేని పూర్ణచంద్రరావు కు ప్రభుత్వం 928 ఖాతా నెంబరుతో పట్టాదారు పాసుపుస్తకాన్ని 22-11-2023న రెవెన్యూ అధికారులు ఆయనకు గల మూడు సర్వే నెంబరులలో 4-19 ఎకరాల భూమిని రెవెన్యూ రికార్డులలో నమోదు చేసి, వైఎస్సార్‌ శాశ్వత భూహక్కు పథకం క్రింద మంజూరు చేశారు. ఇది బట్టబయలైంది. అప్పటి నుంచి ఈ పాసుపుస్తకాన్ని వినియోగించుకుంటున్న రైతు పాసుపుస్తకాన్ని కలర్‌ జిరాక్స్ చేసి చించడంతో బాబు డ్రామా బట్టబయలైంది. పుంగనూరు ప్రజలను ఎలాగైన మోసగించేందుకు చంద్రబాబు, కిరణ్‌లు డ్రామా ఆడటంతో నవ్వులపాలైయ్యారు. ఎక్కడో గుంటూరుకు చెందిన పూర్ణచంద్రరావు పాసుపుస్తకం పుంగనూరులో చించివేయడంతో తెలుగుదేశం వర్గాలు సైతం బాబు డ్రామాలకు విస్తుపోయారు.

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన …

చంద్రాబాబు నాయుడు పుంగనూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఎన్నికల నిబంధనలను ఉల్లంగించారు. సభలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డిని తీవ్రంగా విమర్శించి, ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఇతరులకు ప్రభుత్వం జారీ చేసిన పాసుపుస్తకాలను చించిపడేశారు. 5:15 గంటల వరకే ప్రసంగించాల్సి ఉండగా 6 గంటలకు కూడ ప్రసంగాన్ని కొనసాగించి కోడ్‌ ఉల్లంగించారు. అలాగే జాతీయ పతాకాన్ని కార్యకర్తలు పార్టీ జెండాలతో కలిపి పట్టుకుని అవమానించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు జన సమీకరణకు వాహనాలను వినియోగించారు. సభకు వచ్చిన వారికి మధ్యం, నగదు, పంపిణీ చేశారు. ఎంతో మంది అతిగా మధ్యం సేవించి రోడ్డుపై పడిపోయారు. చంద్రబాబు సభకు రెండు గంటల ముందు నుంచి పోలీసులు ఎంబిటి రోడ్డు వెహోత్తం కిలో మీటరు మేర బ్యారీకెడ్లు అడ్డుపెట్టి ట్రాఫిక్‌ ఆపివేశారు. బస్సులను, కార్లను, ద్విచక్రవాహనాలను ఆపివేయడంతో ప్రజలు అవస్థలు పడి శాపనార్థాలు పెట్టారు. అలాగే ఆర్టీసి బస్టాండు ప్రాంతంలో ఇంటి పనులు చేస్తున్న కూలీలను సైతం పనులను పోలీసులు ఆపివేయించారు. ఇదేంకర్మ మాకు అంటు పనులుఆపివేస్తే మాకు డబ్బులు ఎవరు ఇస్తారంటు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేనకు నోసీట్‌…

పుంగనూరు ఎన్నికల ప్రచార రథంలో జనసేన నాయకులకు తావులేకపోవడంతో వెనకుండిపోయారు. చంద్రబాబు ప్రసంగం సమయంలో కిరణ్‌, చల్లాబాబు, వెంకట్రమణరాజు లకు మాత్రమే చోటు కల్పించారు. బాబు ప్రసంగం మోదీ , కిరణ్‌ లనే పదేపదే ప్రస్తావించారు. చివరన పవన్‌కళ్యాణ్‌ను ప్రస్తావించారు. సభలో నామమాత్రంగా జనసేన జెండాలు కనపడ్డాయి. దీనిపై జనసైనికులు తీవ్ర అవమానాలకు గురైయ్యామని , ఇలాంటి సభలకు రాకపోతే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Tags: Lunar play

Post Midle