పుంగనూరులో 1 నుంచి అంగన్‌వాడీలలో భోజనం

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వాదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాలలో భోజన పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లు ఐసిడిఎస్‌ పీవో భారతి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు నాణ్యమైన భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఐసిడిఎస్‌ పరిధిలో 252 అంగన్‌వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. కేంద్రాలలో 3 నుంచి 6 సంవత్సరాలు వయసు గల ప్రీస్కూల్‌ పిల్లలకు కూడ భోజనం పంపిణీ చేస్తామని తెలిపారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం క్రింద ఈ కార్యక్రమం పకడ్భంధిగా అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

Tags: Lunch at Anganwadi from 1 in Punganur

Leave A Reply

Your email address will not be published.