Lunch for police and municipal workers

పోలీసులకు, మున్సిపల్‌ కార్మికులకు భోజనం

Date:03/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని పలువురు దాతలు పోలీసులకు , మున్సిపల్‌ కార్మికులకు భోజనం పంపిణీ చేశారు. పట్టణంలోని కొత్తయిండ్లకు చెందిన సాయిబాబా ఆలయ కమిటి అధ్యక్షుడు త్రిమూర్తిరెడ్డి, రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేశారు. అలాగే కార్పెంటర్ల సంఘ అధక్షుడు కేశవరెడ్డి ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లు పంపిణీ చేశారు. విశ్రాంత మిలటరీ ఉద్యోగులు గణేష్‌, శ్రీనివాసులు ఆధ్వర్యంలో మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ, సీఐ గంగిరెడ్డి పాల్గొని , దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ , రామాంజులు, వెహోగిలప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు.

 కోవిడ్ 19 వైరస్ గురించి ఒక శుభవార్త!

Tags: Lunch for police and municipal workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *