మద్యాహ్న భోజనం కార్మికుల అందోళన
విశాఖపట్నం ముచ్చట్లు:
మద్యాహ్న బోజన పధకం అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం అవలంబిస్తోందని యూనియన్ రాష్ట్ర అద్యక్షురాలు వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ లు పరిష్కారించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమయానికి బిల్లులు చెల్లిండంలేదని, బడ్జెట్ కేటాయింపు జరగలేదని తెలిపారు. డబ్బులు ఇవ్వకుండా నాణ్యమైన బోజనం ఎలా పెట్టగలం అని ప్రశ్నించారు. చెకింగ్ ల పేరుతో స్కూల్ చైర్మన్ లు, వెలుగు ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు తీవ్ర మనో వేదన కు గురి చేస్తున్నారన్నారు. గత ఎన్నో సంవత్సరాలు గా ఇదే వృత్తి ని జీవనోపాధి గా చేసుకుని బ్రతుకు తున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పుంగనూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Lunch is a workers’ concern