M.L., who consulted the Kovid victims. No Chevireddy

కోవిడ్ బాధితులను పరామర్శించిన  ఎం.ఎల్. ఏ చెవిరెడ్డి

Date:13/08/2020

తిరుపతి ముచ్చట్లు:

స్విమ్స్ శ్రీ పద్మావతి స్టేట్ కోవిడ్ ఆసుపత్రి లో వైద్య సేవలు పొందుతున్న కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ప్రభుత్వ విప్, కోవిడ్ సమన్వయ కమిటీ కో చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు .ఇప్పుడు ఉన్న కోవిడ్ గడ్డు కాలంలో డాక్టర్లు సైతం పాజిటివ్ బాధితుల వద్దకు వెళ్లేందుకు సాహసించే క్రమంలో చెవిరెడ్డి పిపీఈ కిట్టు ధరించి బాధితుల వద్దకు వెళ్ళి వాళ్లకు మనో దైర్యాని నింపారు.ఆయన వెంట వెంట జే.సీ వీరబ్రహ్మం( అభివృద్ది), మీడియా ప్రతినిధి ఒకరు ఉన్నారు. ఆసుపత్రిలోని 398 మంది బాధితులను వివిధ దశల్లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ పరామర్శించి మనోధైర్యం కల్పించారు.వైద్య సేవలు, నాణ్యమైన ఆహారం, పారిశుద్ధ్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన బాధితులు. ఈ సందర్భంగా చెవి రెడ్డి మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులను రక్షించుకోవడం నా వంతు బాధ్యత ,వారికి ఎల్ల వేళలా నేను అందుబాటులో ఉంటాను అని తెలియ జేశారు.

ఏపీ వాదన వినిపించాలి

Tags:M.L., who consulted the Kovid victims. No Chevireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *