యంత్ర సేధ్యం….

-75 గ్రూపులకు రూ.3.98 కోట్ల యంత్రాలు
– సబ్సిడి రూ.1.26 కోట్లు
-ఇక సులువుగా సేధ్యం
– గత ఇబ్బందులకు పుల్‌స్టాప్‌
-కూలీల భారం తగ్గింపు

పుంగనూరు:

Post Midle

రైతుల సంక్షేమం కోసం వ్యవసాయంలో యాంత్రిక పద్దతులను ప్రవేశపెట్టి , వ్యవసాయాన్ని యంత్ర సేధ్యంగా మార్చుతూ రైతుల శ్రమభారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ యంత్రసేవా పథకం పుంగనూరు నియోజకవర్గంలో పటిష్టంగా అమలు జరుగుతోంది. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో యాంత్రిక సేధ్యం పరుగులు తీస్తోంది. 75 గ్రూపులకు రూ.3.98 కోట్ల రూపాయలు విలువ చేసే యంత్రాలను పంపిణీ చేశారు. ఇందులో రైతులకు సబ్సిడి క్రింద రూ.1.26 కోట్లు పంపిణీ చేశారు. దీనిపై గ్రామీణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సిహెచ్‌సి గ్రూపులు …

గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఆర్‌బికెలలో 10 మంది రైతులను సిహెచ్‌సి గ్రూపులుగా ఏర్పాటు చేశారు. ఒకొక్క గ్రూపుకు సుమారు రూ.10 లక్షలు విలువ చేసే ట్రాక్టర్‌తో పాటు రూ.10 లక్షలు విలువ చేసే 30 రకాల వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించారు. సకాలంలో రైతులు తమ పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు యాంత్రిక మార్గానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా కూలీల భారం తగ్గించడంతో పాటు వ్యవసాయ పనులను సకాలంలో వేగవంతంగా పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మండల రైతులు …

పుంగనూరు మండలంలోని 22 ఆర్‌బికె కేంద్రాలలో రైతులు 14,172 మంది ఉన్నారు. ఖరీఫ్‌లో 5,413 హెక్టార్లలో పంటలు పండిస్తారు. రబీ సీజన్‌లో 13,379 హెక్టార్లలో రైతులు పంటలు పండిస్తున్నారు. మండలంలో వెహోత్తం 8,613 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. అలాగే ఉధ్యానవన పంటలు 6,150 హెక్టార్లలో పండిస్తున్నారు. టమోటా, వరి, వేరుశెనగ పంటలు అధికంగా పండిస్తారు. అలాగే మామిడి , నీలగీరితైలం , అల్లనేరేడు, జామ తోటలలో అంతర్‌ పంటలు రాగి, ఉలవలు, కంది, జొన్నలు, సజ్జలు సాగు చేస్తున్నారు.

వినియోగం ఇలా…

రైతు భరోసా కేంద్రాల ద్వారా ఒకొక్క యూనిట్‌ను మంజూరు చేశారు. ఈ యంత్రాలతో రోజుకు 8 గంటల నుంచి 12 గంటల వరకు పని చేసేందుకు వీలుంది. దీని ద్వారా ఆర్‌బికె పరిధిలోని రైతులు దుక్కులు , నాట్లు వేసుకోవడం, విత్తనాలు వేయడం యంత్రాల ద్వారా నిర్వహించుకుని వ్యవసాయ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు వీలుంది. అలాగే కలుపు తీసేందుకు కూడ యంత్రాలు రావడం రైతులకు ఎంతో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.

లబ్ధిపొందిన రైతులు…

పుంగనూరు నియోజకవర్గంలోని సిహెచ్‌సి గ్రూపుల్లో 5 మంది ఒకొక్క గ్రూపులో ఉండేలా ఏర్పాటు చేశారు. మండలంలో వెహోత్తం 15 మందికి రూ.1.20 కోట్ల రూపాయల యంత్రాలు అందజేశారు. అలాగే చౌడేపల్లె మండలంలో 13 మంది రైతులకు రూ.45.46 లక్షలు, సోమల మండలంలో 10 మంది రైతులకు రూ.38.41 లక్షలు, సదుం మండలంలో 8 మంది రైతు గ్రూపులకు రూ.88.68 లక్షలు, పులిచెర్ల మండలంలో 17 మంది రైతులకు రూ.56.26 లక్షలు, రొంపిచెర్ల మండలంలో 12 మంది రైతులకు రూ.43.44 లక్షల విలువ చేసే యంత్రాలు అందజేశారు.

 

పనిభారం తగ్గించారు….

గ్రామీణ కూలీలకు పని భారం తగ్గించడంతో పాటు రైతులకు వ్యవసాయంలో యాంత్రిక విధానాన్ని ప్రవేశపెట్టడం సులభతరం. గతంలో పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ కూడ ఉండేది కాదు. దీని ద్వారా వ్యవసాయ భూమి దుక్కి చేయలేక , పంటలు పండించడం కష్టమైయ్యేది. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్‌బికెలో ట్రాక్టర్‌ ఉండటంతో సకాలంలో వ్యవసాయ పనులు చేసుకుని వెహోత్తం పొలాలను సాగు చేసుకునేందుకు వీలు కలిగింది. వ్యవసాయంలో యాంత్రిక విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి రుణపడి ఉన్నాం.

-చెన్నకృష్ణ. రైతు, నల్లగుట్లపల్లె.

కూలీల భారం తగ్గింది….

ప్రభుత్వం రాయితీపై ట్రాక్టర్‌, రోటావేటర్‌, పవర్‌వీడర్‌ ఇవ్వడంతో వ్యవసాయ పనులు సులభమైంది. వ్యవసాయంలో కూలీల భారం తగ్గింది. యంత్రాలతో సకాలంలో వేగవంతంగా పనులు చేసుకుంటాం. మిగిలిన కాలంలో యంత్రాలను రైతులకు అద్దెలకు పంపి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం.

-సాకిబండ ప్రకాష్‌ , నెల్లిమంద.

ఇంటి వద్దనే యంత్రాలు….

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్‌బికెల ద్వారా వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉండటంతో వ్యవసాయ యంత్రాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే పని లేకుండ ఇంటి వద్దనే యంత్రాలు అందుబాటులో ఉండటం హర్షనీయం. వాణిజ్యపరంగా పంటలను తరలించేందుకు సులభమైంది.

– సి.వీరయ్య, ఆవులపెద్దిరెడ్డిగారిపల్లె.

రైతు సంక్షేమ ప్రభుత్వం….

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోంది. మాసంఘానికి రాయితీతో ఈరోజు ట్రాక్టరును పంపిణీ చేశారు. ఇది వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అవసరమైన రైతులు ఆర్బీకేల ద్వారా ట్రాక్టరును తమ వ్యవసాయ పనులకు ఉపయోగించుకునే వెసులు బాటు ఉంది.

– వెంకటరెడ్డి, బూరగంద, సదుం.

 

Tags: Machine farming ….

Post Midle
Natyam ad