మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయాలి

Date:03/07/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఎంతో చరిత్ర కలిగి, భారతదేశంలోనే అతి పెద్ద డివిజన్‌గా ఉన్న మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండు చేశారు. శుక్రవారం పట్టణంలోని బిజెపి నుంచి అయూబ్‌ఖాన్‌, బీసీల నాయకుడు కృష్ణమూర్తి, బహుజన సంఘ నాయకులు శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ విశిష్ట చరిత్ర కలిగిన మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని, ఈ విషయమై మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు గంగరాజు, నాగరాజు, రాజాజెట్టి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు వరం

Tags:Madanapalle district should be established

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *