Natyam ad

మదనపల్లికే తలమానికం మెడికల్ కళాశాల, బీటీ కళాశాల యూనివర్సిటి, కేంద్ర విశ్వవిద్యాలయాలు..

–ఆశీర్వదించండి అభివృద్దే అజెండాగా ముందుకు పోతాం:ఎంపీ..
–మంచి మనిషి, మృదు స్వభావి నిసార్ అహమ్మద్..
— సర్వేలన్నీ డాక్టర్ దేశ తిప్పారెడ్డికి వచ్చాయి..
— సీఎం జగన్మోహన్ రెడ్డి మదనపల్లి నేను మైనార్టీలకు కేటాయించాడు అందరూ మరొక్కసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు…

 

మదనపల్లి ముచ్చట్లు:

Post Midle

మదనపల్లి నియోజకవర్గాన్ని వందల కోట్లతో అభివృద్ధి చేశాం. ఇంకా మరింతగా అభివృద్ధి చేస్తాం.. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్దే అజెండాగా ముందుకు పోతామని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. మదనపల్లి మిషన్ కాంపౌండ్ లో శుక్రవారం నియోజకవర్గస్థాయి కార్యకర్తలు నాయకుల సమన్వయ సమావేశం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ.. మదనపల్లికి మెడికల్ కళాశాల, బిటి కళాశాలను యూనివర్సిటీ చేయడం, కేంద్ర విశ్వవిద్యా లయాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి గ్రామానికి రోడ్లను కూడా వేయించా మన్నారు. మృదుస్వభావి మంచి మనసున్న వ్యక్తి నిసార్ అహమ్మద్ మదనపల్లి కి సరిపడు వ్యక్తి అని కితాబిచ్చారు. సర్వేలన్నీ డాక్టర్ దేశ తిప్పారెడ్డి కే వచ్చినప్పటికీ.. సీఎం జగన్మోహన్ రెడ్డి మదనపల్లి నిమర్వ మారు మైనార్టీలకు కేటాయించాల్సి వచ్చిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వివిధ స్థాయిల వైసిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

 

Tags: Madanapallike Talamanikam Medical College, Beatty College University, Central Universities..

Post Midle