Natyam ad

భద్రకాళీకి మాడవీధులు

వరంగల్ ముచ్చట్లు:


తెలంగాణలో టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి.. అందులో భాగంగా వరంగల్ లోని భద్రకాళి ఆలయంలో మాడవీధుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు విడుదల చేసింది.. అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్..కాకతీయ వారసత్వ నగరం ఓరుగల్లు ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకోబోతుందని అన్నారు.  ఓరుగల్లు ప్రజల ఇలావేల్పు దైవం భద్రకాళి అమ్మవారి మాడ వీధుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.. మాడ వీధుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ చొరవతో 30 కోట్ల నిధులు విడుదయ్యాయి. కమిషనర్, దేవాదాయశాఖ అధికారులు, భద్రకాళి అర్చకులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం మాడ వీధుల నిర్మాణానికి చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు..టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి చేపట్టే చర్యలపై సమీక్షించారు…సంబంధిత అధికారులు, ప్రధాన అర్చకులతో కలిసి మాడ వీధుల నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలను భద్రకాళి ఆలయ ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు..భద్రకాళి అమ్మవారి నిర్మించనున్న రాజగోపురం నమూనాను పరిశీలించారు..మాడ వీధుల నిర్మాణానికి రూ.30 కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, పలువురు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు..

 

 

 

భద్రకాళి ఆలయం పక్కనగల బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు వల్ల ఎకో టూరిజం పెరిగిందని, కేటీఆర్ సహకారంతో నగరంలో అన్ని హంగులతో ఆహ్లాదకరమైన పార్క్ ల ఏర్పాట్లతో సహా సుమారు రూ 50 కోట్ల వ్యయంతో భద్రకాళి బండ్ ను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు… టెంపుల్ టూరిజం కాన్సెప్ట్ లో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు.. రెండు వేల సంవత్సరాల క్రితం వెలసిన జైన మతానికి చెందిన అగ్గలయ్యగుట్టతో పాటు, ప్రకృతి సహజసిద్ధమైన అందాలను అనుసంధానం చేయడం ద్వారా టూరిజాన్ని ప్రోత్సహించవచ్చునని అన్నారు.. ఓరుగల్లు నగరం హెల్త్, ఎడ్యుకేషన్, కల్చరల్ హబ్ గా తీర్చిదిద్దబడుతున్న ప్రస్తుత తరుణంలో టూరిజం హబ్ గా తీర్చిదిద్దడానికి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

 

Post Midle

Tags: Madavedhus to Bhadrakali

Post Midle