సీఎంచే ఎనిమిదవ శ్వేతపత్రo విడుదల

Made by eighth white paper o

Made by eighth white paper o

Date:31/12/2018
అమరావతి ముచ్చట్లు:
 పరిశ్రమలు,  ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాలలో నాలుగున్నరేళ్ళుగా జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం విడుదల చేసారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, యువజన వ్యవహారాలపై శ్వేతపత్రం రూపోందించారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సంపద సృష్టించేందుకు, తలసరి ఆదాయాన్ని పెంచేందుకు పరిశ్రమ, సేవల రంగాలే చోదకశక్తి. చారిత్రక కారణాల వల్లనే మన రాష్ట్రంలో సేవారంగం, పారిశ్రామిక రంగం వెనుకబడి ఉన్నాయి.
12 శాతం వృద్ది రావాలని లక్ష్యంగా పెట్టుకుంటే 10.5 వృద్ధి సాధించాం. ఆశించిన వృద్ధి సాధించగలిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం అవుతుందని అన్నారు. 55 శాతం ఉపాధి మన రాష్ట్రంలో వ్యవసాయరంగం నుంచే వున్నారు. ఈ శక్తిని పారిశ్రామిక రంగానికి, సేవల రంగానికి మార్చగలిగితే మన తలసరి ఆదాయం పెరుగుతుంది. హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్ టూరిజం ముఖ్య గ్రోత్ ఇంజన్లు. ప్రత్యేక కేటగిరీ హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చిన ఆర్థిక ప్రోత్సాహకాలు ఆంధ్ర ప్రదేశ్కు దక్కలేదు.
విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం గ్రాంటు ఇవ్వలేదు. పెట్టుబడి పెట్టలేదు. ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడారులో మాత్రం పెట్టుబడి పెట్టింది.  గ్రీన్ ఫీల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్టాలన్న హామీ కార్యరూపం దాల్చలేదు. కడప జిలాలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలన్న హమీకి కూడా అదే గతి పట్టింది. పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ చట్టం 2017 తీసుకొచ్చాం. పరిశ్రమలకు అవసరమైన 74 సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందజేయడానికి అవసరమైన చట్టం ఇదని అయన ఆన్నారు.
వరుసగా మూడు సార్లు 2016,2017,2018 లలో భాగస్వామ్య సదస్సులను విశాఖపట్నంలో నిర్వహించాం. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవర్టన్, పతంజలి, జైన్ ఇరిగేషన్, పార్లే, జెర్సీ, ఇండస్ కాఫీ, ఫ్యూచర్ గ్రూప్, కాంటినెంటల్ కాఫీ, ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్, గోద్రేజ్, ఎస్ హెచ్ గ్రూప్, టాటా ఫుడ్స్, ఐటీసీ, కాన్ఆగ్రో, మన్ పసంద్ వంటి పరిశ్రమలు వచ్చాయి.
జౌళి రంగంలో ఎక్స్ పోర్ట్స్, శ్రీ గోవింద రాజ టెక్స్ టైల్స్, ఎస్ఏఆర్ డెనిమ్, పేజ్ ఇండస్ట్రీస్ (జాకీ), అరవింద్ గ్రూప్, నిషా డిజైన్స్, గుంటూరు టెక్స్ టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్ టైల్ పార్క్ వంటి సంస్థలు వచ్చాయి. ఆటోమొబైల్ రంగంలో ఇసుజు, కియా మోటార్లు, అపోలో టైర్లు, అశోక్ లేలాండ్, భారత్ ఫోర్జ్, హీరో గ్రూప్ వచ్చాయి.ఐటీ, సెల్ ఫోన్ తయారీ రంగంలో ఫాక్స్ కాన్, సెల్కాన్, ఫ్లెక్స్ ట్రానిక్స్, డిక్సన్, రిలయన్స్, టీసీఎల్, వోల్టాస్ వంటి సంస్తలు వచ్చాయని సీఎం చెప్పారు.
Tags; Made by eighth white paper o

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed