Natyam ad

మాదిగ కుల సంఘాల మద్దతు టిడిపి, ఎన్ డి ఏ కూటమి కే

-మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నెకంటి రమేష్ మాదిగ వెల్లడి

అమరావతి ముచ్చట్లు:

Post Midle

జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ కుల సంఘాలు తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి కే సంపూర్ణ మద్దతు ను మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నెకంటి రమేష్ మాదిగ తెలియజేశారు. మంగళగిరి నగరంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ మాదిగ మాట్లాడుతూ టిడిపి, ఎన్ డి ఏ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా పోటీలో ఉన్న అభ్యర్థులకు, ప్రత్యేకించి మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారా లోకేష్ ను గెలిపించాలని మాదిగ దండోరా మాదిగ కుల సంఘాలకు ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు తెలియజేశారని అధికారం రాగానే చేస్తామని చెప్పడం జరిగిందని పొన్నెకంటి రమేష్ మాదిగ తెలిపారు.

 

 

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడం, ప్రత్యేకించి ఎస్సీలకు కేటాయించిన 27 పథకాలను రద్దుచేసి ఎస్సీలను మోసగించాడని ఆయన విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విదేశీ విద్యను పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి జగనన్న విద్యా దీవెన పెట్టడం దళితులను మోసం చేయటమేనని అన్నారు. దళిత నేత కొదమల కుమార్ మాట్లాడుతూ వైసిపి మాదిగలకు తగిన గుర్తింపు ఇవ్వకుండా సామాజిక న్యాయం కూడా చేయటం లేదన్నారు.టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో 15 సీట్లను మాదిగలకు కేటాయించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తున్న టిడిపి , ఎన్ డి ఏ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కుమార్ మాదిగ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో దళిత నాయకులు కొలకలూరి జాన్ వెస్లీ, కాకర్లమూడి రమేష్, మాసిపోగు అశోక్ మాదిగ , శుద్ధపల్లి వినోద్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Madiga caste communities support TDP, NDA alliance

Post Midle