Madukumar Sharma is the chairman of the Brahmin community

బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడుగా మదుకుమార్‌శర్మ

Date:09/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు గాయిత్రిమాత తాలూక బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడుగా మదుకుమార్‌శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నియోజకవర్గ స్థాయి బ్రాహ్మణ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సంఘ కార్యదర్శిగా కోదండరామయ్యను , ఉపాధ్యక్షులుగా ఆర్‌కె.రామక్రిష్ణ, డాక్టర్‌ రమణరావు, అశ్వర్థనారాయణరావు, మురళిధర్‌ను ఎన్నుకున్నారు. కోశాధికారులుగా కుమార్‌, లక్ష్మినారాయణ, న్యాయసలహాదారుగా పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, పీఆర్‌వోగా రవికుమార్‌ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మదుకుమార్‌ మాట్లాడుతూ సంఘాన్ని అభివృద్ధి పరచి, బ్రాహ్మణుల స్మశాన వాటిక, కమ్యూనిటి భవనాలను నిర్మించేందుకు సంఘం తరపున మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలసి మంజూరు చేయాల్సిందిగా కోరుతామన్నారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణరావు, రామనాథశర్మ, క్రిష్ణమూర్తి, టివిఎస్‌ ప్రసాద్‌, శ్రీనివాసులు, రఘు, రవి, సుమన్‌శాస్మి, పవన్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ మిథున్‌రెడ్డికి చౌడేపల్లె నేతలు శుభాకాంక్షలు

Tags:Madukumar Sharma is the chairman of the Brahmin community

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *