మాగంటి ఇంట పెళ్లి సందడి

Maganti is getting married in the house

Maganti is getting married in the house

Date:07/12/2018
ఏలూరు ముచ్చట్లు:
ఏలూరు  ఎంపి మాగంటి బాబు ఇంట పెళ్లి సందడి మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఈ నెల 23 తేదీ రాత్రి ఏలూరు రానున్నారు. ఈ సందర్భంగా స్థానిక సిఆర్ రెడ్డి కళాశాల గ్రౌండ్స్ లో శుక్రవారం ఏర్పాట్ల పై ఏలూరు ఎంపి మాగంటి బాబు అడిషినల్ నస్ పి ఈశ్వరరావు, ట్రాఫిక్ డిఎస్ పి భాస్కర్ రావుతో చర్చించారు. ముఖ్యమంత్రి ఈ నెల 23 వతేదీ సాయత్రం విజయవాడలో బయలుదేరి రాత్రికి తమ కుమారుని వివాహ రిసెఫ్ షన్ కోసం హాజరయ్యేందుకు కుటుంబ సమేతంగా ఏలూరు చేరుకుంటారని  మాగంటిబాబు చెప్పారు. సిఆర్ రెడ్డి గ్రౌండ్స్ లో నూతన వధూవరులు మాగంటి దామోదర రవీంధ్రనాద్ చౌదరి, సాహిత్య దంపతులను ఆశీర్వదిస్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబంతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు  పాల్గొని వధూవరులకు దీవెనలందించారు అని మాగంటి బాబు చెప్పారు. ఈ దృష్ట్యా నగరంలో  పటిష్టవంతమైన ట్రాపిక్ నియంత్రణ ఏర్పాట్టు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.
మాగంటిబాబు, పద్మవల్లి దేవిల కనిష్ట పుత్రుడు దామోదర రవీంధ్రనాధ్ చౌదరి సాహిత్యల వివాహ మహోత్సవం ఈ నెల 21 తేదీన 21 వ తేదీన రాజమహేంద్రవరంలో  జరుగుతుంది. 23వ తేదీ రాత్రి ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల గ్రౌడ్స్ లో 50 వేల  మందికి పైగా ప్రజలు కార్యకర్తలు అభిమానుల కోసం బంధుమిత్రుల కోసం ప్రత్యేక భోజన ఏర్పాట్టను కూడా చేస్తున్నారు. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని మాగంటి బాబు పోలీస్ అధికారులను కోరారు. దీని పై అడిషనల్ ఎస్ పి ఈశ్వరరావు ఆద్వరంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం వున్న దృఫ్ట్యా ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల వద్ద వాహనాలకోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లను కూడా పోలీస్ అధికారులు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్ రెడ్డి కళాశాల పాలక వర్గ నాయకులు ప్రసాద్, దుర్గరావు, చింతలపూడి ఎఎమ్ సి మా.ఈ ఛైర్మన్ ముత్తారెడ్డి, ఏలూరు కార్పొరేఫన్ మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకట రత్నం, విప్ గూడవల్లి వాసు కార్పొరేటర్లు బౌరోతు బాలాజీ పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.
Tags:Maganti is getting married in the house

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *