టెస్టింగ్ కిట్లలో మాయాజాలం

Date:13/08/2020

కాకినాడ ముచ్చట్లు:

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వేళ అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇస్తోన్న ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను పక్కదారి పట్టిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. కాకినాడ కార్పోరేషన్ పరిధిలో కిట్లు పక్కదారి పట్టినట్టు గుర్తించారు అధికారులు. కాకినాడ నగరపాలక సంస్థ మెడికల్ ఆఫీసర్ కరీముల్లా ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి.హెల్త్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ ను మాతృసంస్థకు బదిలీ చేశారు. కిట్ల మాయాజాలంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి. ఫోర్జరీ సంతకాలతో జిజిహెచ్ కు చెందిన ఉద్యోగి మరో 300 కిట్లు తీసుకున్నట్టు విచారణలో గుర్తించారు. గతంలో కాకినాడ జీజీహెచ్ లో ఎంఎన్ఓగా పని చేసిన బాషా ఫోర్జరీ చేసినట్టు నిర్ధారణ అయింది.

ప్రస్తుతం అమలాపురం ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తోన్న బాషా జీజీహెచ్ ఆర్ఎంఓ సంతకం ఫోర్జరీ చేసి 300 కిట్లు తీసుకుని వెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి. రంగంలోకి దిగిన కాకినాడ త్రీ టౌన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు బాషా. ఇప్పటి వరకు వచ్చిన కిట్లు.. నిర్వహించిన పరీక్షలపై విచారణ చేపట్టిరట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు సెంట్రల్ జైలులో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో జిల్లాలోనే ఎక్కువ కేసులు వుంటున్నాయి. గ్రామాలను కూడా కరోనా వణికిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి చెందిన 39 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు.

 

నిన్నటి వరకు పది మంది అర్చకులు, సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. ఇవాళ 300 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, మరో 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 252 మందికి ఖైదీలకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన మెడికల్‌ కిట్లను సమకూర్చింది. ఖైదీల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు జైలులో ఉన్న వైద్యుడితో పాటు బయట నుంచి కూడా డాక్టర్లను పంపి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేశారు. పాజిటివ్‌ వచ్చిన ఖైదీలకు పౌష్టికాహారంగా ప్రతిరోజు గుడ్డు, పాలు, పప్పు, ఆకు కూరలు, పెరుగు తదితర వాటిని అందించనున్నారు.
కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 14 వరకు దర్శనాలు, వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు ప్రకటించారు. స్వామివారికి ఏకాంతంగా నిత్యసేవలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరించడంతో అర్చకులు,సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి.

 

రాముడి పోస్టల్ స్టాంపులకు డిమాండ్

Tags:Magic in testing kits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *