వైభవంగా నల్లగొండ్ల బ్రహ్మోత్సవాలు
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నల్లగొండ్ల గ్రామంలో కలిసిన శ్రీ గృహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. దేవస్థాన ధర్మకర్త మండలి మరియు దేవస్థాన ఈవో కళ్యాణోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధి సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామి అమ్మవారి కృపలకు పాత్రులయ్యారు.
Tags: Magnificent Nalgonda Brahmotsavams