Natyam ad

ఇర్రిపాకలో కోటి మట్టి శివలింగాల తో మహా కుంభాభిషేకం

మట్టి శివలింగాల తయారీ ప్రారంభించిన జ్యోతుల నెహ్రూ దంపతులు, జ్యోతుల నవీన్ దంపతులు

జగ్గంపేట  ముచ్చట్లు:

జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని మట్టి శివలింగాలతో మహా కుంభాభిషేకం నిర్వహించడానికి జ్యోతుల నెహ్రూ, నిర్ణయించ తలపెట్టారు. డిసెంబర్ 6వ తేదీ బుధవారం వేదపండితుల ముహూర్తం ప్రకారం 8:30 మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమం జ్యోతుల నెహ్రూ శ్రీమతి మణి దంపతులు, జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మట్టి శివలింగాల తయారీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ మట్టి శివలింగాలతో మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నామని ఈ మట్టి శివలింగాల తయారీలో యావన్మంది భక్తులు ప్రతిరోజు పాల్గొని కోటి మట్టి శివలింగాల తయారీలో భాగస్వాములై ఆ పరమశివుడి కృపకు పాత్రులు అవుతారని ఈ దైవ కార్యక్రమానికి మట్టి శివలింగాల తయారీకి మీ అందరి సహాయ సహకారాలు కావాలని జ్యోతుల నెహ్రూ కోరారు.

 

Post Midle

Tags: Maha Kumbhabhishekam with crores of mud Shivalingas in Irripaka

Post Midle