Natyam ad

శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి మహా మండలాభిషేక పూజలు

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాలకు మండల అభిషేకం పూజల లో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు . శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాలైన మార్కండేయ తీర్థం,వేయిలింగాలకొన,దుర్గేశ్వర స్వామి దేవాలయం,శ్రీకాళహస్తి,ETC సెంటర్ నందలి శివాలయం, ఊరుందూరు గ్రామంలో అన్నపూర్ణాదేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి మహా మండలాభిషేక పూజలు శాస్త్ర యుక్తంగా నిర్వహించారు. అనుబంధ ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావడమే ధర్మకర్తల మండలి లక్ష్యమని  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాలైన మార్కండేయ తీర్థం,వేయిలింగాలకొన,దుర్గేశ్వర స్వామి దేవాలయం,శ్రీకాళహస్తి,ETC సెంటర్ నందలి శివాలయం, ఊరుందూరు గ్రామంలో అన్నపూర్ణాదేవి సమేత   నీలకంఠేశ్వర స్వామి వారికి మహా కుంభాభిషేకం నిర్వహించి 41రోజులు అయిన సందర్భంగా మహా మండలాభిషేక పూజలు శాస్త్ర యుక్తంగా చేపట్టారు.

 

 

 

Post Midle

ఈ పూజాది కార్యక్రమాల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొని విశేష పూజలు జరుపుకున్నారు. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధం ఆలయాలకు పూర్వ వైభవం కల్పించే లక్ష్యంగా 20 నుంచి 30 ఏళ్ల గా మహా కుంభాభిషేకాలు జరగని ఆలయాల అన్నింటికీ కుంభాభిషేకాలు నిర్వహించి మూలవిరాట్లకు పూర్వ తేజస్సు వచ్చేలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యురాలు భారతి, పసల సుమతి,ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ ఉప ప్రధాన అర్చకుడు దక్షిణామూర్తి,అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్,ఏఈఓ సతీష్ మల్లిక్,అనుబంధ ఆలయాల ఇంచార్జ్ లక్ష్మయ్య వేద పండితులు సంగమేశ్వర శాస్త్రి,పరిచారకుడు గోవింద శర్మ, మోహన్ శర్మ, మరియు పాలమంగళం రవి, దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Maha Mandalabhisheka Poojas to Sri Neelakantheswara Swami

Post Midle