పుంగనూరుకు పెద్దిరెడ్డితో మహర్ధశ

Mahadarsha with Pedredreddi for Punganur

Mahadarsha with Pedredreddi for Punganur

-ఆర్టీసి డిపో గేట్లు తెరుచుకోనున్నాయ్‌…
– సమ్మర్‌స్టోరేజ్‌కు నీరు

Date:09/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి మంత్రి పెద్దిరెడ్డి శ్రీకారం చుట్టారు. సుమారు పది సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోని సమ్మర్‌స్టోర్‌జ్‌ ట్యాంకు, ఆర్టీసి డిపోను ప్రారంభించేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ పనులను ప్రారంభించి, ప్రజలకు అంకితం చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ రెండు కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇంజనీరింగ్‌ , ఆర్టీసి అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించి, ఇందుకు అవసరమైన మోటార్లు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. పుంగనూరు ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించేందుకు 2010లో పనులు ప్రారంభించి సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకును నిర్మించారు. సుమారు రూ.33.33 కోట్లతో పనులను శరవేగంగా పూర్తి చేశారు. పెద్దిరెడ్డి చేసిన అపర భగీరథయత్నానికి మాజీ ముఖ్యమంత్రులు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు అడ్డుకుని ఆపివేశారు. దీనిపై ఆగ్రహంతో పెద్దిరెడ్డి పుంగనూరు నుంచి గార్గెయప్రాజెక్టు వరకు వేలాది మంది ప్రజలతో 77 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి పనులను కొనసాగించాలని హెచ్చరించారు. కాని ప్రారంభించకపోవడంతో పట్టణ ప్రజలకు దాహార్తి తీరకపోయింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ట్యాంకులు, పంపుహౌసులు ,, స్టోరేజ్‌ట్యాంకు, పైపులైన్లు నిరుపయోగమైంది. దీనిపై వైఎస్సార్సీపి అధికారంలోకి రాగానే పనులు ప్రారంభిస్తామని పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. వైఎస్సార్సీపి అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో మంత్రి పెద్దిరెడ్డి వీటిపై దృష్టి సారించి, శరవేగంగా పనులు ప్రారంభించేందుకు జీవో విడుదల చేయించారు. ఈ మేరకు ఇంజనీరింగ్‌ అధికారులతో పాటు కమిషనర్‌ కెఎల్‌.వర్మ కలసి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. నెల రోజులలోపు పనులను ప్రారంభించనున్నారు.

ఆర్టీసి డిపో ……

పుంగనూరు నియోజకవర్గ ప్రజల కోసం రూ. 2 కోట్లతో నిర్మించిన ఆర్టీసి డిపో త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. ప్రభుత్వం డిపో ప్రారంభించాలని జీవోను విడుదల చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు డిపోను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. డిపోను పరిశీలించారు. డిపోలో బస్సులకు డీజల్‌ నింపేందుకు ప్రైవేటు వారితో చర్చించారు. అలాగే ఆర్టీసి బస్టాండు సమీపంలోని ప్రైవేటు భవనంలో డిపో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. కాగా గత వారం ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరు నుంచి విజయవాడకు ఇంద్ర ఏసి బస్సులను ప్రారంభించారు. గత నెలలో తిరుపతి, బెంగళూరు సర్వీసులను ప్రారంభించారు. కాగా పుంగనూరులో ఆర్టీసి డిపో ఏర్పాటు చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి మంజూరు చేశారు. 2009లో ఆర్టీసి డిపో పనులను మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేశారు. రాజకీయ మార్పులతో మాజీ సీఎంలు పుంగనూరులో అభివృద్ధిని అడ్డుకున్నారు. ప్రస్తుతం దీనిపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

11న మెగా రక్తదాన శిబిరం

Tags: Mahadarsha with Pedredreddi for Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *